Begin typing your search above and press return to search.

పుష్ప లుక్: ప‌ట్టు చీర.. మ‌ల్లె చెండు .. ఆ ప్రిప‌రేషనేంటి శ్రీ‌వ‌ల్లీ?

By:  Tupaki Desk   |   29 Sep 2021 4:23 AM GMT
పుష్ప లుక్: ప‌ట్టు చీర.. మ‌ల్లె చెండు .. ఆ ప్రిప‌రేషనేంటి శ్రీ‌వ‌ల్లీ?
X
క‌ట్టుకునేందుకు ప‌ట్టు చీర.. తురుముకునేందుకు మ‌ల్లె చెండు .. రెడీగా ఉన్నాయ్..! అప్పుడే జెరీ అంచు ఎర్ర‌ ర‌వికెను తొడిగి సాదా రంగు లంగా(ప‌రికిణీ)ను ధ‌రించి అలా న‌ట్టింట కూకున్న ఆమె ఎవ‌రు? ఆ చెవుల‌కు దిద్దులు స‌వ‌రిస్తోంది.. ఆ త‌ర్వాత ప‌ట్టు చీర క‌ట్టుకునేందుకు రెడీ అవుతోంది. ఇంత‌కీ ఈ ప్రిప‌రేషనేంటి.. దేని కోసం ఎవ‌రికోసం.. ఏమా రాచ‌కార్యం? అంటే..

ఆమె శ్రీ‌వ‌ల్లి. పుష్ప‌రాజ్ భార్య‌. ఈ ప్రిప‌రేష‌న్ అంతా స‌ఖుని కోస‌మేన‌ని అంచ‌నా వేయొచ్చు. ఇంత‌కీ చెవుల‌కు దిద్దులు పెట్టుకుంటూ అలా ఆద‌మ‌రిచిన ర‌ష్మిక కు ముందు సెంటు బాటిలో ఏదో ఒక‌టి వెయిటింగ్.. అది దేనికీ? ఏమో.. ఏదో జ‌ర‌గ‌బోతోంది!! ఇంత‌కీ ఏంట‌దీ..!

పుష్ప చిత్రంలో వివాహిత‌గా న‌టిస్తున్న ర‌ష్మిక మంద‌న లుక్ ని చిత్ర‌బృందం తాజాగా విడుద‌ల చేసింది. ఈ లుక్ ఫెంటాస్టిక్ అనే చెప్పాలి. అప్పుడే ప‌ట్టు చీర క‌ట్టుకునేందుకు రెడీ అవుతున్న ర‌ష్మిక‌లోని మాస్ యాంగిల్ ని గ్లామ‌ర్ ని అంతే అందంగా చూపించారు సుకుమార్. ప‌ల్లె ప‌డ‌తి మాసీ భంగిమ కు మాస్ స్పెల్ బౌండ్ అయిపోవాల్సిందే. ఈ సినిమాని క్రిస్మ‌స్ కానుక‌గా విడుద‌ల చేస్తున్నామ‌ని పోస్ట‌ర్ లో ముద్రించ‌డం ఆస‌క్తిక‌రం. దీనిని బ‌ట్టి బ‌న్ని అభిమానులు ఫుల్ ప్రిప‌రేష‌న్ లోనే ఉంటార‌న‌డంలో సందేహం లేదు. ల‌వ్ స్టోరి స‌క్సెస్ నేప‌థ్యంలో పుష్ప‌లోనూ జోష్ క‌నిపిస్తోంద‌ని భావించ‌వ‌చ్చు.

భారీ అంచ‌నాల నడుమ బ‌రిలోకి..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న `పుష్ప-డ్యూయాలజీ` పై భారీ అంచనాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. బన్నీని నటుడిగా మరో మెట్టు పైకి ఎక్కించే ఫ్రాంఛైజీగా నిలిచిపోతుందని అభిమానులు బలంగా విశ్వసిస్తున్నారు. స్టైలిష్ టిఫికల్ ఫిలిం మేకర్ సుకుమార్ పుష్ప చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా కేటగిరీలో బహుభాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. తెలుగు- తమిళం- మలయాళం- కన్నడం- హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు.

రెండు భాగాల ఫ్రాంచైజీలో మొదటి భాషం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ నేపథ్యంలో పార్ట్ -1 ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో బన్నీ ఎర్రచందనం స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నారు. ఇక గిరిజన యువతి పాత్రలో రష్మిక కనిపించనుందని యూనిట్ రివీల్ చేసింది. ఇప్పటికే ఈ రెండు పాత్రల ఫస్ట్ లుక్ లు ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో వివాహిత గా గృహిణిగా రష్మిక కనిపించనుందని చాలా కాలంగా క‌థ‌నాలొస్తున్నాయి. అంటే పుష్పరాజ్- రష్మిక భార్యాభర్తలుగా కనిపిస్తారని టాక్ ఉంది. దానికి త‌గ్గ‌ట్టే తాజా లుక్ ని రివీల్ చేశారు సుకుమార్.

ర‌ష్మిక‌తో బ‌న్ని ఇంటిమేట్ సన్నివేశాలు మాస్ ఆడియన్ కి కనెక్ట్ అయ్యేలా సుకుమార్ స్టైల్లో ఉంటాయని సమాచారం. ఇప్పటికే ఇద్దరి పాత్రల స్వరూపం ఎలా ఉంటుందన్నది లుక్స్ రూపంలో బయటపడింది. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు కూడా అంతే హైలైట్ గా ఉంటాయని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. పూర్తిగా చిత్తూరు మాండలికంలో నే రెండు పాత్రలు మాట్లాడుతాయి. ఆ శైలికి ఎంత మాత్రం తగ్గకుండా మాస్ కోణంలో ఆద్యంతం పాత్రలు రక్తికట్టిస్తాయని తెలుస్తోంది. ఇటీవలే రిలీజైన నారప్ప చిత్రంలో నెల్లూరు-చిత్తూరు యాస ప్రేక్షకాభిమానుల్ని ఆకట్టుకుంది. పుష్పలో ఈ యాస పాళ్లు మరింత అదనపు ఆకర్షణ కానున్నాయని అర్థమవుతోంది. ముఖ్యంగా నాయకానాయికలే చిత్తూరు యాసతో అదరగొట్టడం ఫ్యాన్స్ కి ఓ రేంజులోనే కనెక్ట్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

అసలు తగ్గేదేలే అంటూ పుష్ప క్రిస్మ‌స్ బ‌రిలో వ‌స్తోంది. డిసెంబర్ లో పుష్ప 1 రిలీజ్ ఖాయ‌మైంది. సంక్రాంతి 2022 బరిలో తీవ్రమైన పోటీ కారణంగా పుష్పను సోలో రిలీజ్ చేస్తున్నార‌ని భావించాలి. బహుభాషల్లో భారీ వసూళ్లను తేవాలంటే బన్ని సోలో రిలీజ్ కి వెళితేనే బావుంటుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషించాయి.