Begin typing your search above and press return to search.

అమ్మడు.. నెక్స్ట్ ఏంటి?

By:  Tupaki Desk   |   18 Nov 2017 7:00 AM IST
అమ్మడు.. నెక్స్ట్ ఏంటి?
X
ప్రస్తుతం టాలీవుడ్ బుల్లి తెరపై హాట్ యాంకర్స్ హవా బాగానే కొనసాగుతోంది. కానీ సినిమాల వరకు వచ్చేసరికి వారి ఆశలన్నీ ఆవిరి అవుతున్నాయి. బుల్లితెరపై హాట్ డ్రెస్సులతో అండ్ సెక్సీ లుక్స్ తో కుర్రకారు మతిని పోగొడుతోన్న వారు వెండి తెరపై ఎంత రచ్చ చేసినా సక్సెస్ ని అందుకోలేకపోతున్నారు. ఆ తరహాలో ఇప్పుడు ఎవరున్నారో అర్ధమయ్యే ఉంటుంది.

జబర్దస్త్ హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ తన అందాలతో బుల్లి తెరపై ఏ స్థాయిలో రచ్చ చేస్తుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక గుంటూరు టాకీస్ లో రష్మీ హాట్ గా కనిపించి ఓ వర్గం వారిని బాగా ఆకర్షించింది కానీ సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత అరకొర సినిమాల్లో అవకాశాలు వచ్చినా కూడా పెద్దగా ఏమి విజయాలను అందుకోలేదు. గుంటూర్ టాకీస్ ఒక్కటే కాస్త తెరిపినిచ్చింది. ఇక రీసెంట్ గా నెక్స్ట్ నువ్వే లో కనిపించినా ఆ సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేదు.

విడుదలకు ముందు చిత్ర యూనిట్ ఎక్కువగా రష్మీ డైలాగులతో గ్లామర్ షోతో ప్రమోషన్ ని గట్టిగానే ప్లాన్ చేసింది. కానీ సినిమాలో మ్యాటర్ మిస్ అవ్వడంతో అది కూడా డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పటివరకు రష్మీ కేరీర్ లో తీసిన అయిదు సినిమాలు వరుసగా డిజాస్టర్ అయ్యాయి. ఇక అమ్మడి చేతిలో ప్రస్తుతం టీవీ షోలు తప్ప సినిమాలు లేవు. మరి నెక్స్ట్ ఏమైనా అవకాశాలు అందుకుంటుందో లేదో చూడాలి.