Begin typing your search above and press return to search.
అదంతా యాక్టింగ్ మాత్రమే
By: Tupaki Desk | 8 May 2020 12:15 PM ISTజబర్దస్త్.. ఢీ షోల్లో రష్మీ సుధీర్ ల మద్య నడిచే లవ్ ట్రాక్ వారిద్దరు ఒకరిపై ఒకరు వేసుకునే పంచ్ లకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ రెండు షోలను కేవలం వీరిద్దరి కోసం చూసే వారు చాలా మంది ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇద్దరి మద్య ప్రేమ వ్యవహారం సాగుతుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఏకంగా పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. కాని అవన్ని ఒట్టి పుకార్లే అని పదే పదే రష్మి.. సుధీర్ లు చెబుతూ వచ్చారు.
తాజాగా మరోసారి సుధీర్ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ గురించి రష్మీ స్పందించింది. కెమెరా ముందు కాకుండా ఆఫ్ స్క్రీన్ లో ఇద్దరి మద్య కనీసం కలిసేంతటి స్నేహం కూడా లేదని.. అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుకునే సాదారణ స్నేహం మాత్రమే మాదని పేర్కొంది. సెట్ లో కేవలం మాది యాక్టింగ్ మాత్రమే. ఇద్దరం మంచి నటులం మాత్రమే అంతకు మించి ఏమీ లేదంది.
ప్రస్తుతం లాక్ డౌన్ టైంను తన సొంత ప్రాంతం అయిన వైజాగ్ లో కుటుంబ సభ్యులతో గడుపుతున్నానంది. మూగ జీవాలకు ఆహారం అందించడం కోసం కొందరు వాలింటీర్లతో కలిసి ప్రతి రోజు కొంత సమయంను కేటాయించానంది. ఇక పెళ్లి విషయమై స్పందిస్తూ అది నా వ్యక్తిగత విషయం. ఎప్పుడు ఎవరితో అనే విషయంలో నేను ఇప్పుడే చెప్పలేను. పెళ్లి ఫిక్స్ అయితే మాత్రం తప్పకుండా అందరికి చెప్తానంది.