Begin typing your search above and press return to search.

జాంబీ రేష్మీ.. వచ్చెనంట

By:  Tupaki Desk   |   29 Feb 2016 10:30 PM GMT
జాంబీ రేష్మీ.. వచ్చెనంట
X
జబర్దస్త్ కామెడీ షోలో పార్టిసిపెంట్స్ తో పాటు.. రష్మీ కూడా ఈ మధ్య బాగానే జోక్స్ పేల్చుతోంది. స్కిట్స్ అయిపోయాక.. అందాలతో పాటు ప్రేక్షకులకు నవ్వులు కూడా పంచే ట్యాలెంట్ రష్మీ గౌతమ్ కి ఉంది. బుల్లితెరపై బాగానే ఉన్నా.. వెండితెరపైనా వెలిగిపోవాలన్నది అమ్మడి డ్రీం. ఇప్పటికే ఈమె నటించిన గుంటూరు టాకీస్ విడుదలకు సిద్ధం కాగా.. ఇప్పుడు మరో మూవీలోనూ రష్మీ లీడ్ రోల్ లో నటిస్తోంది.

నవ్వులు పంచే భామతో భయపెట్టిస్తే ఎలా ఉంటుంది? ఇదే థాట్ డైరెక్టర్ వెంకట కాచర్లకు వచ్చింది. అందుకే తను తీస్తున్న చిత్రంలో హీరోయిన్ గా తీసుకున్నాడు. ఇప్పుడీ సినిమాకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి కాగా.. ఫస్ట్ లుక్ తో పాటు సినిమా టైటిల్ ని కూడా అనౌన్స్ చేశారు. 'తను వచ్చెనంట' అనే టైటిల్ ను ఈ మూవీకి ఫిక్స్ చేశారు. తేజ కాకుమాను - రష్మీ గౌతమ్ - ధన్య బాలకృష్ణలతోపాటు చలాకీ చంటి కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

తెలుగులో తొలిసారిగా జాంబీ కాన్సెప్ట్ తో తను వచ్చెనంట రూపొందుతోంది. అయితే.. ఇది కూడా హారర్ కామెడీ టైపులో.. జాంబీ కామెడీ మూవీ. ఈ సినిమాతో ప్రేక్షకులకు సరికొత్త జోనర్ పరిచయం చేయబోతున్నామని డైరెక్టర్ అంటున్నాడు. ఫస్ట్ లుక్ లో రష్మీ బాగానే భయపెట్టేందుకు ట్రై చేసింది. మరి సినిమాలో కూడా నవ్విస్తూ భయపెడుతుందో? భయపెట్టడంలో నవ్విస్తుందో?