Begin typing your search above and press return to search.

అబ్బే.. జబ్బరదస్తులో పాత అందాలే

By:  Tupaki Desk   |   17 Nov 2015 5:56 AM GMT
అబ్బే.. జబ్బరదస్తులో పాత అందాలే
X
''న‌న్నెవ‌రూ తీసేయ‌డం లేదోచ్‌. ఇలాంటివ‌న్నీ స్పెక్యులేష‌న్స్‌ - గాలి వార్త‌లు'' అంటూ కొట్టిపారేస్తూ సోషల్‌ నెట్‌ వర్కులో వివ‌ర‌ణ ఇచ్చుకుంది హాట్‌ యాంకర్‌ రష్మి గౌతమ్‌. ఒక‌వేళ త‌న‌ని తీసేసే ప‌రిస్థితి వ‌స్తే అది ఎలాంటి ఎమోష‌న్ క్రియేట్ చేస్తుందో అమ్మడిని ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రికీ అర్థ‌మ‌వుతోంది. అంత‌గా ఈ భామ జ‌బ‌ర్ధ‌స్త్ షోతో - ఆ టీమ్‌ తో మింగిల్ అయిపోయింది.

నిజానికి నాగ‌బాబు - రోజా ఇద్ద‌రితో రష్మికి బాగా సింక్ కుదిరింది. అలాగే జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడియ‌న్ల‌తోనూ అనసూయ కంటే సాన్నిహిత్యం బాగానే సెట్ట‌య్యింది. ఇలాంట‌ప్పుడు ఈ షోని వ‌దిలి వేరే షో వెతుక్కోవాలంటే క‌ష్ట‌మే మ‌రి. ఏది నిజమో తెలియదు కాని.. ఈ మధ్యనే అమ్మడిని తీసేస్తున్నారు అనే రూమర్‌ వచ్చింది. సినిమాల్లోకి జంప్‌ అయిపోదాం అని ఈవిడే వదిలస్తోందట అని గాసిప్పులు వినిపించాయ్‌. ప్ర‌తి సినిమాలో ఒకే క‌థానాయిక ఉంటే బోర్ కొడుతుందేమో కాని.. రష్మి విషయంలో మాత్రం బుల్లితెర ఆడియన్స్‌ కు బోరు కొట్టల్లేదు. అందుకేనేమో.. అమ్మడు కూడా నేను జబర్‌ దస్త్‌ ను ఎక్సట్రా జబర్‌ దస్త్‌ ను వదిలి వెళ్ళట్లేదని స్పష్టం చేసింది.

జ‌బ‌ర్ధ‌స్త్ షోలోకి మ‌ళ్లీ యాంక‌ర్ అన‌సూయ కానీ, మాటీవీ యాంక‌ర్ శ్యామ‌ల కానీ ఎంట‌ర‌య్యే ఛాన్సుంద‌ని కూడా ఊహాగానాలు సాగుతున్నాయి. లేదూ వీళ్లెవ‌రూ కాదు.. జ‌నాల‌కు తెలియ‌ని వేరొక కొత్త గ్లామ‌ర‌స్ యాంక‌ర్‌ ని ఇంట్ర‌డ్యూస్ చేస్తే ఎలా ఉంటుందా అంటూ విమర్శకులు కూడా ఈ షో గురించి తెగ డిస్కస్‌ చేశారు. కాని చివరకు.. మళ్లీ రష్మితోనే యథావిథిగా ప్రయాణం అని తేలింది.