Begin typing your search above and press return to search.

ఇదంతా బుల్లితెరే ఇచ్చిందంటున్న హాటీ

By:  Tupaki Desk   |   1 May 2018 9:55 AM IST
ఇదంతా బుల్లితెరే ఇచ్చిందంటున్న హాటీ
X
రష్మీ గౌతమ్ ఇప్పుడు బాగా బిజీ. ఒకప్పుడు సినిమా అవకాశాల కోసం పడిగాపులు పడిన స్థాయి నుంచి.. చిన్న చిన్న పాత్రలతో సరిపెట్టుకునే రేంజ్ నుంచి.. ఇప్పుడు అటు వెండితెరను ఇటు బుల్లితెరను అలరించే స్థాయికి వచ్చేసింది. యాంకర్ గాను.. యాక్ట్రెస్ గాను ఫుల్ డిమాండ్ ఉన్న హాట్ బ్యూటీ రష్మీ.

ఫిలిం ఇండస్ట్రీలో తన యాక్టింగ్ ట్యాలెంట్ ను చూపించే అవకాశం దక్కితే.. తనలోని నైపుణ్యాలను మెరుగుపరచుకునేందుకు టీవీ రంగం ఎంతో సహాయపడిందని అంటోంది రష్మీ గౌతమ్. 'ప్రేక్షకులు ఇప్పుడు నా మీద ఇంతటి ఆదరాభిమానాలు చూపిస్తున్నారంటే.. అందుకు కచ్చితంగా టెలివిజన్ షోస్ కారణం. నాలోని ఓ కొత్త వ్యక్తిని నాకే పరిచయం చేశాయి బుల్లితెర కార్యక్రమాలు. పర్సనాలిటీ ఇంప్రూవ్ చేసుకునేందుకు కూడా ఉపయోగపడ్డాయి. రియాలిటీ షోలలో స్పాంటేనియస్ గా ప్రవర్తించాల్సి ఉంటుంది. ఇదిసినిమాలలో అనేక సవాళ్లను ఎదుర్కునేందుకు నాకు ఉపయోగపడింది. నా శక్తియుక్తులను పెంపొందించడంలో కూడా టీవీ పాత్ర కీలకం' అంటోంది రష్మి.

సినిమాలు.. టీవీ షోస్.. ఇలా రెండింటితో బిజీగా ఉన్నా.. తనకు టైం దొరికిప్పుడల్లా వెకేషన్ కు వెళ్లడాన్ని ఇష్టపడతానని చెబుతోంది ఈ హాట్ యాంకర్. హాలిడే టూర్స్ తో.. రీఫ్రెష్ అండ్ రీఛార్జ్ అవచ్చని.. వర్క్ విషయంలో మరింత యాక్టివ్ గా ఉండేందుకు ఇవి ఉపయోగపడతాయని అంటోంది రష్మి.