Begin typing your search above and press return to search.

రష్మీ.. సెన్సార్ రావచ్చు జాగ్రత్త

By:  Tupaki Desk   |   27 Oct 2017 3:31 PM IST
రష్మీ.. సెన్సార్ రావచ్చు జాగ్రత్త
X
నిజంగా సినీ ప్రపంచంలో గర్ల్స్ ఎంతో ఫాస్ట్ అయ్యారనే చెప్పాలి. ఒకవేళ ఈ మాట ఎవరైనా అబద్ధం అంటే నిరూపించడానికి వారిని వెండి తెర వరకు తీసుకెళ్ల వలసిన అవసరం లేదు. రోజు బుల్లితెరపై వచ్చే షోలని చూపిస్తే చాలు.. వారి సొగసులు ఏ రేంజ్ లో రచ్చ చేస్తున్నాయో. ఏ మాత్రం లిమిట్స్ లేకుండా సెక్సీ చూపులతో హాట్ డ్రెస్సులతో ప్రతి ఇంట్లో వచ్చే రియాలిటీ షోలలో కుర్రకారుని ఆకర్షిస్తున్నారు.

వారిలో జబర్దస్ట్ యాంకర్ రష్మీ టాప్ లో ఉందని చెప్పాలి. సాదారణంగా మొన్నటి వరకు టీవీ షోల్లో కనిపించిన యాంకర్స్ నార్మల్ గానే ఉండేవారు. కానీ రోజులు మారాయి. యాంకర్స్ కూడా స్టైల్ ని చాలా వరకు చేంజ్ చేశారు. రష్మీ కూడా మొదట కొంచెం నార్మల్ గానే ఉండేది కానీ షోకి అందాలతో బూస్ట్ ని ఇచ్చింది. జబర్దస్త్ నవ్వులతో పాటు ఓ వర్గం ప్రేక్షకులకు తెలియని ఆనందాన్ని ఎదో ఇస్తుందిలే.

ఇటీవల అమ్మడు వేసిన ఒక డ్రెస్ ని చూస్తే ఎంతటివారైనా షాక్ అవ్వాల్సిందే. క్లివేజ్ షోతో అదరగొట్టింది. ప్రస్తుతం ఆమె ఫొటోలు సోషలో మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. ఎంతో కాలంగా సినిమాలకు సెన్సార్ ఉంటోంది. సీరియల్స్ కి కూడా సెన్సార్ రూల్ పెట్టాలని కొందరు అంటున్నారు. మరి రష్మీ ఈ రేంజ్ లో రెచ్చిపోతే సెన్సార్ షోల వరకు వచ్చేలా ఉంది.