Begin typing your search above and press return to search.

సెక్సీ యాంకర్‌ సర్జరీ చేయించుకుంటోందా?

By:  Tupaki Desk   |   2 Jun 2016 6:23 AM GMT
సెక్సీ యాంకర్‌ సర్జరీ చేయించుకుంటోందా?
X
సినిమా రంగంలో ప్రయత్నాలు ఫలించక.. టీవీలో ట్యాలెంట్ చూపించి, అటు నుంచి మళ్లీ ఫిలిం ఇండస్ట్రీలోకొచ్చి జెండా పాతేసిన భామ రష్మీ గౌతమ్. సెక్సీ యాంకర్ అని తెలుగు ప్రేక్షకులు ఇప్పటికే ఈమెకు ఓ బిరుదుకూడా తగిలించేశారు. తనను జనాలు ఎలా చూడాలని అనుకుంటున్నారో.. వారి ఆశలకు అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా.. ఎవరినీ నిరాశపరచకుండా.. గుంటూరు టాకీస్ లో కనిపించింది రష్మీ.

ఆ తర్వాత ఒప్పుకున్న సినిమాల్లో కూడా ఆడియన్స్ ను ఫుల్లుగా శాటిస్ఫై చేసేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోందని చెప్పచ్చు. తనకు వచ్చిన ఇమేజ్ ని యాజిటీజ్ గా తీసుకోగలగడం రష్మీ ప్రత్యేకత. అసలు తనను సెక్సీ బ్యూటీ అని పిలవడం ఓ క్రెడిట్ కం క్రెడిబిలిటీ అని కూడా చెప్పేసిందీమె. ఇప్పుడీ బ్యూటీ కొత్తగా కనిపించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టేసిందని తెలుస్తోంది. ఓ చిన్నపాటి సర్జరీకోసం ఈ సుందరి అమెరికా వెళ్లిందట. అక్కడ ఫేస్ కి సంబంధించిన కొన్ని సర్జరీలతో పాటు.. తన అందాన్ని మరింతగా పెంచుకునేలా ఏర్పాట్లు చేసుకుందని తెలుస్తోంది.

ఇండియా తిరగొచ్చాక టాలీవుడ్ ఆడియన్స్ కి మైండ్ బ్లాంక్ అయ్యేలా మేకోవర్ ఉండాలన్నది రష్మీ ఐడియా. అటు ప్రేక్షకులతోపాటు ఇటు ఇండస్ట్రీ జనాలకు కూడా సేమ్ షాక్ కొట్టిందంటే మాత్రం.. అమ్మడి కెరీర్ కి బ్రేకులు వేయడం కష్టమైపోతుంది. అఫ్ కోర్స్.. అమ్మడి ఆలోచన కూడా అదే అయుంటుంది లెండి.