Begin typing your search above and press return to search.

టాకీస్ భామలు తెగ రెచ్చిపోతున్నారుగా

By:  Tupaki Desk   |   20 Feb 2016 5:24 AM GMT
టాకీస్ భామలు తెగ రెచ్చిపోతున్నారుగా
X
ఆరు నెలల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న గుంటూరు టాకీస్ కి ఇప్పటికి మోక్షం కలుగుతోంది. ఇంకా రిలీజ్ డేట్ ఇవ్వలేదు కానీ.. ఆడియో మాత్రం ఇవాళే విడుదలవుతోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ - టీజర్లు అంటూ తెగ హడావిడి చేసిన యూనిట్.. ఆడియో రిలీజ్ ని కూడా బాగానే ప్రమోట్ చేసింది. సాధారణంగా ఆడియో కోసం ఓ పోస్టర్ ఇస్తారు, లేదా చిన్న టీజర్ ఇస్తారు.

కానీ గుంటూరు టాకీస్ కోసం ఏకంగా నాలుగైదు ఆడియో టీజర్లు ఇచ్చారు. ఐదారు సెకన్ల టీజర్ నుంచి నిమిషం పైగా వినిపించే ప్రమోషనల్ సాంగ్స్ కూడా ఉన్నాయి. అన్నింటిలోనూ కేరక్టర్లు -కంటెంట్ కామన్ గా కనిపిస్తున్నా.. ప్రజెంటేషన్ మాత్రం డిఫరెంట్ గానే ఉంది. ముఖ్యంగా ఈ మూవీపై బోలెడు హోప్స్ పెట్టుకున్నారు ముద్దుగుమ్మలు రేష్మీ గౌతమ్ - శ్రద్ధా దాస్. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ గుంటూరు టాకీస్ కోసం తాము ఎంతవరకూ కష్టపడగలరో అంతా ట్రై చేసేస్తున్నారు.

ప్రమోషన్స్ కోసమే స్పెషల్ పాటల్లో డ్యాన్సులు - వీరి వయ్యారాలు చూస్తుంటే.. ఏదో బాలీవుడ్ రేంజ్ లో భారీ బడ్జెట్ మూవీకి చేస్తున్న రేంజ్ లో ఉంది వీళ్ల వాలకం. ఈ ఒక్క సినిమా సరిగా ఆడిందంటే.. ఇక తాము టాప్ హీరోయిన్స్ అయిపోవడమే అనిపించేలా.. రెచ్చిపోతున్నారు శ్రద్ధ - రష్మీలు. మరి వీళ్ల ఆశలను ప్రవీణ్ సత్తారు ఏ రేంజ్ లో తీరుస్తాడో తెలియాలంటే.. రిలీజ్ వరకూ ఆగాల్సిందే.