Begin typing your search above and press return to search.

రష్మీ కొత్త సినిమా సీక్రెట్ ఇదే

By:  Tupaki Desk   |   25 Feb 2016 1:30 PM GMT
రష్మీ కొత్త సినిమా సీక్రెట్ ఇదే
X
జబర్దస్త్ యాంకర్ రష్మీ హీరోయిన్ అవతారం ఎత్తి.. గుంటూరు టాకీస్ తో తెగ అందాలు ఒలకబోసింది. సినిమా స్టోరీ కంటే రష్మీ అందాలే హాట్ టాపిక్ అయ్యాయి. పబ్లిసిటీ కూడా రష్మీ చుట్టే తిరుగుతుండడం విశేషమే. ఈ మూవీతో ఎలాగైనా హీరోయిన్ మెటీరియల్ అనిపించునేందుకు.. రష్మీ కూడా బాగానే కష్టపడింది. అయితే.. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తన నెక్ట్స్ వెంచర్ ఇరగదీసేస్తానంటూ మాట జారింది ఈ భామ. అదేంటీ అంటే చెప్పలేదు కానీ.. గుంటూరు టాకీస్ లో నా అందాలు చూశారు.. కొత్త సినిమాలో నాలోని ఇంకో యాంగిల్ ని చూపించబోతున్నా అంటూ టీజ్ చేసింది ఈ హీరోయిన్.

అయితే.. ఇప్పుడు రష్మీ ట్యాలెంట్ చూపించబోయే ఆ సినిమా సంగతులు ఇప్పుడు బయటకొచ్చాయి. తొలిసారిగా తెలుగు తెరపై జాంబీ కాన్సెప్ట్ తో ఓ మూవీ చేస్తున్నారట. అందులో లీడ్ హీరోయిన్ గా రష్మీని తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పుడే తమిళంలో జయం రవి హీరోగా ఒక జాంబీ మూవీ వచ్చింది. హాలీవుడ్ లో అయితే ఈ కాన్సెప్ట్ తో మూవీస్ కుమ్మేస్తున్నారు. ఇప్పుడు తెలుగులోనూ జాంబీలు సందడి చేయనున్నాయన్న మాట.

తన నెక్ట్స్ పిక్చర్ జాంబీ మూవీ కాబట్టి.. తనలో మరో యాంగిల్ అంటే భయపడ్డమో, భయపెట్టడమో చేసేందుకు రష్మీ రెడీ అయిపోనుంది. అదే మనం ఈ భామలో చూడబోయే కొత్త యాంగిల్.