Begin typing your search above and press return to search.

సెక్సీ యాంక‌ర‌మ్మా.. స్లమ్‌ ఏముందిలే

By:  Tupaki Desk   |   26 Sep 2015 5:37 AM GMT
సెక్సీ యాంక‌ర‌మ్మా.. స్లమ్‌ ఏముందిలే
X
నేను స్ల‌మ్‌ లో పుట్టాను. స్ల‌మ్‌ లో పెరిగాను. డీగ్లామ‌ర‌స్‌ గా క‌నిపిస్తాను... అయినా కిక్కిస్తాను.. అని చెబుతోంది ఈ బుల్లితెర యాంక‌ర‌మ్మ‌. అస‌లు యాంక‌ర్ ఏంటి స్ల‌మ్ములో పుట్ట‌డ‌మేంటి? స‌్ల‌మ్‌ డాగ్ మిలియ‌నీర్‌ గా ఎద‌గ‌డేమేంటి? లెట్స్ చెక్ డీటెయిల్స్‌...

బుల్లితెర యాంక‌ర్ రష్మి గౌత‌మ్ జ‌బ‌ర్ధ‌స్త్ రియాలిటీ షోతో ఇంటా బైటా పాపుల‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు తెలుగు - త‌మిళ్ సినీప‌రిశ్ర‌మ‌ల్లో క‌థానాయిక‌గా ఎటెంప్ట్ చేస్తోంది. త‌న‌వైపు అందివ‌చ్చిన ఏ అవ‌కాశాన్ని వ‌దిలిపెట్ట‌డం లేదు. అప్ప‌ట్లో త‌మిళంలో ఓ సినిమాలో నాయిక‌గా మెరిసింది. ఆ చిత్రం ఆశించినంత విజ‌యం సాధించ‌లేదు. ప్ర‌స్తుతం ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో గుంటూర్ టాకీస్ చిత్రంలో న‌టిస్తోంది. ఈ సినిమాలో స్ల‌మ్ నుంచి వ‌చ్చిన అమ్మాయిగా డీగ్లామ‌ర‌స్ రోల్ పోషించాన‌ని చెబుతోంది. డీగ్లామ‌రస్‌ గా క‌నిపించినా అందంతో ఆక‌ట్టుకుంటాన‌ని చెబుతోంది. నా క్యారెక్ట‌ర్ పేరు సువ‌ర్ణ‌. సువ‌ర్ణ అంద‌రికీ న‌చ్చుతుంది. ఈ సినిమా నాకు రీలాంచ్ లాంటిది. పెద్ద హీరోయిన్ అవుతాన‌నే న‌మ్మ‌కాన్ని వెలిబుచ్చింది.

ఇకపోతే అసలు రష్మి చెబుతున్న స్లమ్‌ లుక్‌ ఏమోగాని.. అమ్మడు ఓణీలో నెల్లూరు నెరజాణ రేంజులో కిక్కిస్తున్న సంగతి మనకి తెలసిందే. పేరుకే డీ-గ్లామరస్‌ కాని.. ఆరబోయాల్సిన అందం అంతా బాగాన గుమ్మరించావ్‌ గా బేబీ.. ఇక స్లమ్‌ గిమ్‌ ఏముంది..