Begin typing your search above and press return to search.

హాటీ వెళ్లిపోతే.. టి వి షో సంగతేంటి?

By:  Tupaki Desk   |   16 Sep 2015 1:30 AM GMT
హాటీ వెళ్లిపోతే.. టి వి షో సంగతేంటి?
X
ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్.. నేనేంటో నిరూపిస్తా.. ఈ డైలాగ్ బాగా ఫేమస్. సినిమాల్లో ట్రై చేసే అందరిలో ఉండే కామన్ ఫీలింగ్ అది. ఒక ఛాన్స్ కోసమే అంతగా ఎదురుచూస్తే.. మరి వరుసగా అవకాశాలొస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ? జబర్దస్త్ భామల హుషారు ఇలాగే ఉంది మరి.

కామెడీషోలో అందాలను ఆరబోసి.. ఆ కార్యక్రమంలో పండే నవ్వుల కంటే.. ఎక్కువ ఫేమస్ అయిపోయింది అనసూయ. ఆ తర్వాత రష్మి కూడా ఇదే రూట్ ఫాలో అయిపోయింది. కాకపోతే.. ఈ చిన్నది ముందునుంచి మూవీల మీద ఎక్కువ హోప్స్ నే పెట్టుకుంది. తాజాగా నాగ్ పక్కన అనసూయ చెప్పుకోదగ్గ కేరక్టర్ నే చేస్తోంది. రష్మీ ఇప్పటికే గుంటూరు టాకీస్ అనే మూవీ కంప్లీట్ చేసేసి, చారుశీలలో లీడ్ కేరక్టర్ ని కూడా పట్టేసింది. వాలకం చూస్తుంటే టాలీవుడ్ లో జెండా పాతేయడానికి వీళ్లు గట్టిగానే డిసైడ్ అయ్యారని అర్ధమవుతుంది. మరి ఇప్పుడు రష్మీ కూడా సినిమాల్లోకి వెళ్లిపోతే.. జబర్దస్త్ సంగతేంటి ?

ఆ ప్రోగ్రాంలో యాంకరింగ్ చేయాలంటే నవ్వించడం రాకపోయినా.. వయ్యారాలు ఒలకపోయాలి. బూతు జోకులకు ఎంజాయ్ చేయాలి. డబుల్ మీనింగ్ డైలాగులు డైరెక్టుగా తన మీదే పడ్డా తుడుచుకుపోవాలి. ఫ్లోర్ మీద డ్యాన్సులేసుకుంటూ.. గిలిగింతలు పెట్టాలి. ఇన్ని క్వాలిటీస్ ఉంటే సిల్వర్ స్క్రీన్ కే పోతారు కదా.. మరి స్మాల్ స్క్రీన్ కి ఎందుకొస్తారు అనే డౌట్ సహజంగానే వస్తుంది. ఏ.. ఎందుకు రారు.. అనసూయ, రష్మిలు రాలేదా ? జబర్దస్త్ ప్రోగ్రాం చేయలేదా ? అలాగే ఎవరో ఒకళ్లను పట్టేస్తారు లెండి.!