Begin typing your search above and press return to search.

రశ్మి-సుధీర్ నిజమన్నంత పని చేసారే

By:  Tupaki Desk   |   21 March 2018 7:13 AM GMT
రశ్మి-సుధీర్ నిజమన్నంత పని చేసారే
X
ఇటీవలే ఉగాది పండగ సందర్భంగా ఈటీవీ లో ఆహా నా పెళ్ళంట పేరిట యాంకర్ రశ్మి-సుధీర్ ల పెళ్లి తతంగాన్ని నిజం అనిపించే రేంజ్ లో చేయటం బాగా వైరల్ అయ్యింది. టీవిలో ప్రసారమయ్యాక యు ట్యూబ్ లో అప్ లోడ్ చేసిన ఒక్క రోజులోనే 5 మిలియన్ వ్యూస్ దక్కించుకోవడం దీని ఆదరణ చెప్పకనే చెబుతోంది. నిజానికి రెండు గంటల పైగా జరిగిన ఈ ప్రహసనం నిజం పెళ్లినే తలపించింది. సుధీర్-రశ్మిల మధ్య ఉన్న ఏదో ఉందనే గాసిప్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. సరిగ్గా వాటికి ఊతమిచ్చేలా ఇందరు యాంకర్స్ ఉండగా ఈ ఇద్దరినే జోడిగా ఈ ప్రోగ్రాంకు ఎంచుకోవడం పట్ల కారణం రేటింగ్స్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో జబర్దస్త్ టీం మెంబెర్స్ తో పాటు ఈటీవీ సీరియల్స్ లో నటించే తారాగణం, జడ్జ్ లుగా వ్యవహరించే నాగబాబు, రోజా చెరో వైపు కూర్చుని సంగీత్ లాంటివి చేయటం సందడిని బాగా పెంచింది.

పెళ్లిలో సంప్రదాయ బద్ధంగా జరిగే కార్యక్రమాలు మొదలుకొని ఫస్ట్ నైట్ దాకా అన్ని విడమర్చి పెళ్లి వీడియో చూస్తున్న తరహాలో షూట్ చేసిన విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దాని కన్నా ముందు రష్మి సుధీర్ ల మధ్య ప్రేమ ఎలా మొదలైంది ఒకరినిఒకరు అంతగా ఎందుకు ఇష్టపడ్డారు ఎంత ప్రేమ ఉంది అనేది అచ్చం సినిమా ఫక్కిలో చిత్రీకరించడంతో పాటు ఆ ఇద్దరు నిజంగానే ఆ పాత్రల్లో జీవించడం అందరు గమనించారు. చివరిలో ఫస్ట్ నైట్ పూర్తయినట్టు చూపించి సుధీర్ నిద్ర లేవగానే ఇదంతా కలనా అని యమగోల సినిమాలో ఎన్టీఆర్ స్టైల్ లో నిట్టూర్పు వదలడం అంతా బాగానే క్లిక్ అయ్యింది. సరే ఇదంతా ఓకే కాని అందరేసి టీవీ యాంకర్లు - యాక్టర్లు ఉండగా రశ్మి-సుధీర్ కాంబోనే ఎందుకు ఎంచుకున్నారు అనే ప్రశ్నకు మాత్రం సమాధానం వాళ్ళే చెప్పాలి. మొత్తానికి పెళ్లి మాత్రం నిజం అనే రేంజ్ లో చేయించి ఫస్ట్ నైట్ అవ్వగానే తూచ్ ఇదంతా కల అని చూపించిన తీరు సదరు ఛానల్ కు ఆశించిన రేటింగ్స్ నే తెచ్చిపెట్టినట్టు కనిపిస్తోంది.