Begin typing your search above and press return to search.

రాశీఖ‌న్నా క్ర‌ష్ ఏ హీరో మీదంటే?

By:  Tupaki Desk   |   20 Dec 2022 6:43 AM GMT
రాశీఖ‌న్నా క్ర‌ష్ ఏ హీరో మీదంటే?
X
న‌టసింహ బాల‌కృష్ణ హోస్ట్ గా 'అన్ స్టాప‌బుల్ సీజ‌న్-2' ఏ రేంజ్ లో దూసుకుపోతుందో చెప్పాల్సిన ప‌నిలేదు. మొద‌టి సీజ‌న్ హైలైట్ అయింద‌నుకుంటే? అంత‌కుమంచి సీజ‌న్-2ని అంకంత‌కు పైకి లేపుతున్నారు. ఎవ్వ‌రూ ఊహించ‌ని అతిధుల్నీ తీసుకొచ్చి బాలీవుడ్ టాక్ షోల్నే త‌ల‌ద‌న్నేలా స‌క్సెస్ చేస్తున్నారు. రాజ‌కీయం...సినిమా రెండింటిని రంగ‌రించి షోలో ఓ ఆట ఆడుకుంటు న్నారు.

స్టార్ హీరోలంతా! బాల‌య్య‌తో చిట్ చాట్ ని అంతే ఆస్వాదిస్తున్నారు. ఇన్నాళ్లు ఎంత మిస్ అయ్యాం? అంటూ బాల‌య్య ముందు చెప్పుకుంటుంటే? ఆశ్చ‌ర్యం అనిపించ‌క మాన‌దు. తాజా ఎపిసోడ్ కి డార్లింగ్ ప్ర‌భాస్..మ్యాచో స్టార్ గోపీచంద్ హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప్రోమో సంచ‌ల‌నం అవుతుంది. ఈనెల 30న ఫుల్ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది.

తాజాగా మ‌రో కొత్త ఎపిసోడ్ ని అంతే స‌క్సెస్ చేసే దిశ‌గా బాల‌య్య నాటి-మేటి హీరోయిన్ల‌ని రంగంలోకి దించారు. స‌హ‌జ‌న న‌టి జ‌య‌సుధ‌.. అందాల తార జ‌య‌ప్ర‌ద‌ల‌ను జంట‌గా షోకి ఆహ్వానించిన‌ట్లు తెలుస్తోంది.

వీరిద్ద‌రితో పాటు అందాల రాఖీఖ‌న్నాని తీసుకొచ్చారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇందులో బాల‌య్య ముగ్గురు భామ‌ల‌తో క‌లిసి సంద‌డి చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంలోనే రాశీఖన్నానీ నీకు ఏ హీరో మీద క్ర‌ష్ ఉందంటే? ఆమె వెంట‌నే విజయ్ దేవ‌ర‌కొండ పేరు చెప్పింది. ఈ భామ గ‌తంలో దేవ‌ర‌కొండంతో 'వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్' లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. సీన్ డిమాండ్ చేయ‌డంతో ఇంటిమేట్ స‌న్నివేశాల్లో భాగంగా బెడ్ రూమ్ సీన్ల‌లోనూ న‌టించింది.

అయితే బాల‌య్య‌తో చెప్పిన విష‌యాన్ని అమ్మ‌డు ఇప్ప‌టివ‌ర‌కూ ఏ ఇంట‌ర్వ్యూలోనూ రివీల్ చేయ‌లేదు. అడిగినా స్కిప్ కొట్టేది. కానీ బాల‌య్య‌ని చూసే స‌రికి అమ్మ‌డు నిజాలు గ‌డ‌గ‌డా వ‌దిలేసింది. మరి ఇంకా ఇలాంటి ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియాలంటే మొత్తం ఎపిసోడ్ ప్ర‌సారం కావాల్సిందే. ప్ర‌స్తుతం రాశీఖ‌న్నా న‌టిగా బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. తెలుగుతో పాటు త‌మిళ్ సినిమాలు చేస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.