Begin typing your search above and press return to search.

మహేష్ పొగిడాడు.. రషీద్ స్పందించాడు

By:  Tupaki Desk   |   26 May 2018 12:17 PM IST
మహేష్ పొగిడాడు.. రషీద్ స్పందించాడు
X
సూపర్ స్టార్ మహేష్ బాబు క్రికెట్ లవర్ అన్న సంగతి జనాలకు పెద్దగా తెలియదు. అతను అప్పుడప్పుడూ కీలకంగా అనిపించే క్రికెట్ మ్యాచులు చూస్తుంటాడు. తాజాగా ప్రిన్స్ శుక్రవారం రాత్రి సన్‌ రైజర్స్ హైదరాబాద్-కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరగిన ఐపీఎల్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్ చూశాడు. సన్ రైజర్స్ విజయానంతరం ఉద్వేగంగా ట్విట్టర్లో మెసేజ్ కూడా పెట్టాడు. ఈ మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన అఫ్గానిస్థాన్ యువ స్పిన్నర్ రషీద్ ఖాన్ పై మహేష్ ప్రశంసలు కురిపించాడు. ‘టేక్ ఎ బౌ’ అంటూ అతడిని పొగిడాడు. ఈ మ్యాచ్ అమోఘమని అన్నాడు. సన్ రైజర్స్ కు అభినందనలు చెప్పిన మహేష్.. ఆదివారం నాటి ఫైనల్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నట్లు కూడా చెప్పాడు. మహేష్ ఇలా ట్వీట్ చేయడం అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది.

ఆశ్చర్యకరంగా మహేష్ ట్వీట్ మీద రషీద్ ఖాన్ కూడా స్పందించాడు. తాను మహేష్ బాబు సినిమాల్ని ఫాలో అవుతుంటానని చెప్పాడు. ఒక అఫ్గానిస్థాన్ కుర్రాడు.. మహేష్ బాబు చేసే తెలుగు సినిమాల్ని ఫాలో అవుతున్నాడంటే ఆశ్చర్యమే. అతడికి మహేష్ బాబు తెలిసి ఉండటమే ఊహించిన విషయం. మహేష్ బాబు అనే కాదు.. నిన్నటి రషీద్ ప్రదర్శనకు క్రికెట్ ప్రపంచమంతా ఫిదా అయిపోయింది. అతడి ప్రతిభను ఆకాశానికెత్తేసింది. ఎప్పుడూ బౌలింగ్ లోనే మాయ చేసే రషీద్.. నిన్న బ్యాటుతోనూ చెలరేగాడు. మొదట సన్ రైజర్స్ కష్టాల్లో ఉన్నపుడు చివర్లో వచ్చి కేవలం 10 బంతుల్లోనే 34 పరుగులు చేసి జట్టుకు పోరాడే స్కోరు అందించాడు. అనంతరం తన బౌలింగ్ తోనూ మ్యాచ్ ను మలుపు తిప్పాడు. 4 ఓవర్లలో 19 పరుగులే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. అంతే కాదు.. ఒక రనౌట్ చేయడమే కాక 2 క్యాచులు కూడా పట్టి సన్‌ రైజర్స్ ను ఒంటి చేత్తో ఫైనల్ కు తీసుకెళ్లాడు.