Begin typing your search above and press return to search.

మహరాణిలా మెరుస్తున్న లంకలో రాశి

By:  Tupaki Desk   |   14 March 2017 5:53 AM GMT
మహరాణిలా మెరుస్తున్న లంకలో రాశి
X
రాశి.. తెలుగు సినిమాల్లో ఓ వెలుగు వెలిగిపోయిన హీరోయిన్. సింగిల్ గానే సినిమా థియేటర్లకు రప్పించగల క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉండేది. ఆ తర్వాత టైమ్ తో పాటు కనుమరుగు అయిపోయిన రాశి.. ఈ మధ్య కాలంలో అడపాదడపా కేరక్టర్ వేషాలతో కనిపిస్తోందంతే.

ఇప్పుడు లంక అంటూ ఓ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాశి వచ్చేస్తోంది. ఇన్నేళ్లు కేరక్టర్ వేషాలు వేసినా.. ఇది పూర్తిగా ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్. తాజాగా రిలీజ్ చేసిన పూర్తిస్థాయి లుక్ లో కూడా కేవలం రాశిని మాత్రమే ప్రొజెక్ట్ చేశారు. ముదురు నీలం రంగు చీర.. పసుపు రంగు జాకెట్.. భారీగా పెట్టిన చైన్లు-గాజులు- ఇతర ఆభరణాలు చూస్తుంటేనే రాశి కేరక్టర్ ఎంత స్ట్రాంగ్ అనే విషయం అర్ధం చేసుకోవచ్చు. ఇక రాశి మొహంలో కనిపిస్తున్న సీరియస్ నెస్ చూస్తే.. ఈ మధ్య కాలంలో ఈ తరహా సినిమా చూడలేదు అనిపించేయక మానదు.

లంక మూవీకోసం రాశి కొంత వెయిట్ తగ్గింది కూడా. ఈ పాత్ర కోసం ఆ స్థాయిలో డెడికేట్ అయి మరీ చేసింది రాశి. చాలా ఏళ్ల తర్వాత ఫిమేల్ సెంట్రిక్ మూవీ.. అందులోనూ తానే లీడ్ హీరోయిన్ పాత్రను పోషించే సబ్జెక్ట్ రావడంతో.. ఈ అవకాశాన్ని రాశి పక్కాగానే ఉపయోగించుకుందని చెప్పచ్చు. లంక మహారాణి లుక్ లో రాశిని చూస్తుంటే చిన్నపాటి భయం వేసినా ఆశ్చర్యం లేదు. శ్రీముని దర్శకత్వంలో రూపొందుతున్న లంక.. త్వరలో రిలీజ్ కు రెడీ అయిపోతోంది.