Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్27.. ఆ ఇద్దరు వీరేనా!?

By:  Tupaki Desk   |   11 Feb 2017 11:36 AM IST
ఎన్టీఆర్27.. ఆ ఇద్దరు వీరేనా!?
X
జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ప్రారంభమైపోయింది. పూజా కార్యక్రమం సందర్భంగా చాలా సంగతులే చెప్పింది యూనిట్. ఫిబ్రవరి 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభవుతుందని ముందే చెప్పేశారు. అయితే.. ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ల విషయంలో మాత్రం సస్పెన్స్ ఇంకా కంటిన్యూ అవుతోంది. ఇప్పటివరకూ సినిమాకి సంబంధించిన ప్రతీ అప్ డేట్ ని.. నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ అధికారికంగా ప్రకటిస్తోంది.

హీరోయిన్ విషయానికి వస్తే.. రాశి ఖన్నాకు మాత్రమే స్వాగతం పలికాడు కళ్యాణ్ రామ్. అంటే మిగిలిన ఇద్దరు భామల విషయంలో సస్పెన్స్ కంటిన్యూ అవుతోందన్న మాట. మరో భామగా నివేదా థామస్ పేరు వినిపించినా.. కన్ఫామ్ అయితే కాలేదట. టాలీవుడ్ లో తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఎన్టీఆర్ సరసన నటించబోయే ఆ ఇద్దరు ముద్దుగుమ్మల విషయంలో ఓ క్లారిటీకి వచ్చేశారట యూనిట్. జనతా గ్యారేజ్ లో ఐటెం సాంగ్ లో ఆడిపాడిన కాజల్ అగర్వాల్ ని ఒక హీరోయిన్ గాను.. గతంలో ఊసరవెల్లిలో నటించిన మిల్కీ బ్యూటీ తమన్నాను మరో భామగాను ఎంపిక చేసుకున్నారని అంటున్నారు.

ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి.. ప్రస్తుతానికి ఇది రూమర్ అనే అనుకోవాలి. కానీ ఒక యంగ్ బ్యూటీ.. మరో ఇద్దరు సీనియర్ సుందరాంగులు అయితే.. ఈక్వేషన్ బ్యాలన్స్ అవుతుందన్నది ఎన్టీఆర్ టీం యోచనగా చెప్పుకుంటున్నారు.