Begin typing your search above and press return to search.

అప్పుడు హీరో పోలీస్..ఇప్పుడు హీరోయినా..

By:  Tupaki Desk   |   9 Oct 2015 11:00 AM IST
అప్పుడు హీరో పోలీస్..ఇప్పుడు హీరోయినా..
X
ఈ సంవత్సరపు తొలి హిట్ ని పటాస్ రూపంలో అందించిన అనీల్ రావిపూడి ద్వితీయార్ధంలో మరో చిత్రానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసినదే. ఇప్పటికే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాతో విజయానందంలో వున్న సాయి ధరమ్ తేజ్ ని 'సుప్రీమ్' గా మన ముందుకు తీసుకురానున్నాడు.

ఈ చిత్ర షూటింగ్ రెండు రోజుల క్రితమే మొదలైంది. అయితే ఆన్ సెట్స్ లో విడుదల చేసిన పిక్స్ లోఈ సినిమా హీరోయిన్ రాశీఖన్నా ఖాకీ దుస్తులు ధరంచి అలరిస్తుంది. ఈ సినిమాలో రాశీ పోలీస్ ఆఫీసర్ గా కనిపించే సూచనలు వున్నాయి.

పటాస్ సినిమాలో కళ్యాణ్ రామ్ చేత పవర్ ఫుల్ పోలీస్ పాత్ర రుచిచూపించిన అనీల్ ఈ సినిమాలో హీరోయిన్ చేత అదే పోలీస్ ఆఫీసర్ గా కామెడి చేయించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఊహలు గుసగుసలాడే సినిమా తరువాత గుర్తుండిపోయే పాత్ర లభించని రాశీకి ఈ రోలైనా గుర్తుండిపోతే బాగుణ్ణు...