Begin typing your search above and press return to search.

నా తప్పు నాకు అర్ధమైంది

By:  Tupaki Desk   |   1 Feb 2017 12:16 PM IST
నా తప్పు నాకు అర్ధమైంది
X
టాలీవుడ్ లో నెక్ట్స్ జనరేషన్ స్టార్ హీరోయిన్ రేస్ లో ఉందని భావించిన రాశి ఖన్నా.. ఇప్పుడు కొంచెం స్లో అయిన మాట వాస్తవమే. స్టార్ హీరోలతో సినిమాలు అందుకోవడంలో ఇప్పటివరకూ కొంచెం వెనకబడింది కానీ.. ఇప్పుడు మాత్రం అమ్మడి కెరీర్ జోరందుకుంటోంది.

అయితే.. తన కెరీర్ తొలి రోజుల్లో చేసిన తప్పులను గురించి చెప్పింది రాశి ఖన్నా. 'మొదట్లో నాకు నేనే కొన్ని లిమిట్స్ పెట్టుకునేందాన్ని. నేను ఇలాంటి వాటినే చేయగలను.. ఇవి మాత్రమే నాకు తెలుసు అనుకునే దాన్ని. అందుకు తగ్గట్లుగానే డెసిషన్స్ తీసుకునేదాన్ని. కానీ వరుసగా సినిమాలు చేస్తున్న కొద్దీ నాలో మార్పు వచ్చింది. ఆన్ స్క్రీన్ పై చూసుకుని.. నేనేనా ఇంత బాగా చేసింది.. ఇంత ట్యాలెంట్ నాలో ఉందా అనిపించించేది. అప్పుడు నా తప్పు నాకు అర్ధమైంది' అని చెప్పింది రాశి ఖన్నా.

'ఇప్పుడు చాలా డేరింగ్ గా డెసిషన్స్ తీసుకుంటున్నా. సమస్యలు ఎదురైనా ఫేస్ చేయగల గట్స్ అలవర్చుకున్నాను. నా ఫ్రెండ్స్ కి కూడా అదే చెబుతున్నా. ఇకపై ప్రతీ సినిమాతోనూ ఎదగగలననే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ ఆత్మవిశ్వాసం నాకే కనిపిస్తోంది' అని చెబుతున్న రాశి ఖన్నా.. త్వరలో ఆక్సిజన్ మూవీలో గోపీ చంద్ తోను.. ఎన్టీఆర్ మూవీలోనూ నటించనుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/