Begin typing your search above and press return to search.

అందాల బిర్యానీ అందిస్తున్న రాశి

By:  Tupaki Desk   |   31 March 2016 12:23 PM IST
అందాల బిర్యానీ అందిస్తున్న రాశి
X
యంగ్ బ్యూటీ రాశి ఖన్నా ఇప్పుడు బాగా బిజీ. ఒకవైపు సినిమాలు - మరో వైపు ఓపెనింగులు - ఇంకోవైపు ఎండార్స్ మెంట్లు.. అందాల రాశి ఖన్నా అన్నింటినీ కవర్ చేసేస్తోంది. రెస్టారెంట్లు - షాపింగ్ మాల్స్ లాంటి వాటిని ప్రారంభించాలని, రిబ్బన్ కటింగులు చేయాలని తనకొచ్చే ఇన్విటేషన్లను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా హాజరయిపోతోంది రాశి.

తాజాగా ఓ బిర్యానీ కేఫ్ ప్రారంభానికి రాశి ఖన్నాను ఇన్వైట్ చేశారు. ఫుల్లు రెడ్ కలర్ డ్రస్ లో కలర్ ఫుల్ గా వచ్చిన ఈ భామను చూసేందుకు బోలెడు మంది అభిమానులు ఎగబడ్డారు. ఇక్కడ బిర్యానీ అదుర్స్ అంటూనే.. ఈ అందాల భామ తన నాభి అందాలను కూడా వయ్యారంగా ప్రదర్శించింది. ప్రోగ్రాం జరిగినంతసేపు కుర్రదాని ఒంపులు చూడ్డానికే సరిపోయింది. అసలు కార్యక్రమం కంటే తనపైనే అందరి కాన్సన్ ట్రేషన్ ఉండేలా.. ప్రొఫెషనల్ తెలివితేటలను ఈ మధ్య బాగానే ప్రదర్శిస్తోంది రాశి ఖన్నా.

ప్రస్తుతం రాశికి సినిమా ఆఫర్లు కూడా వరుసగా క్యూ కట్టేస్తున్నాయి. మెగా సుప్రీం స్టార్ సాయి ధరం తేజ్ తో కలిసి నటించిన సుప్రీం మూవీ.. ఇప్పుడు రిలీజ్ కు రెడీ అవుతోంది. దీంతోపాటు తనకు బెంగాల్ టైగర్ అంటూ హిట్ ఇచ్చిన రవితేజతో కలిసి మరో చిత్రంలో నటించనుంది. కొత్త దర్శకుడు చక్రి తెరకెక్కించనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మే నెల చివర్లో ప్రారంభం కానుంది. గోపిచంద్‌ సరసన ఆక్సిజెన్‌ సినిమాలో కూడా అమ్మడు నటిస్తోంది.