Begin typing your search above and press return to search.

అఖిల్‌ సినిమాలో ఆమెతో ఐటెం సాంగ్‌

By:  Tupaki Desk   |   18 March 2015 12:44 PM IST
అఖిల్‌ సినిమాలో ఆమెతో ఐటెం సాంగ్‌
X
తన పెద్ద కొడుకు నాగచైతన్యను కొంచెం సింపుల్‌గానే లాంచ్‌ చేశాడు కానీ.. చిన్న కొడుకు అఖిల్‌తో మాత్రం టాలీవుడ్‌లోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇప్పించాలని చూస్తున్నాడు అక్కినేని నాగార్జున. చైతూకు తొలి సినిమా చేదు అనుభవంగా మిగిలిన నేపథ్యంలో అఖిల్‌ విషయంలో మాత్రం ఏమాత్రం తేడా రానివ్వకూడదని భావించి అతణ్ని మాస్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ చేతుల్లో పెట్టాడు నాగ్‌. దాదాపు ఏడాది పాటు కథాకథనాల మీద కసరత్తులు చేయించి.. కోన వెంకట్‌తోనూ టచప్స్‌ చేయించి.. పక్కాగా స్క్రిప్టు సిద్ధమయ్యాక షూటింగ్‌ మొదలుపెట్టించాడు నాగ్‌.

నితిన్‌ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ఫస్ట్‌ షెడ్యూల్‌లో అఖిల్‌ మీద ఇంట్రడక్షన్‌ సీన్స్‌, ఫైట్‌ సీన్స్‌ తీసిన వినాయక్‌.. రెండో షెడ్యూల్‌కు రెడీ అవుతున్నాడు. ఈ షెడ్యూల్‌లో సినిమాకు ప్రధాన ఆకర్షణగా భావిస్తున్న ఐటెం సాంగ్‌ను చిత్రీకరించబోతున్నాడు. ఈ సాంగ్‌ చేయబోయేది ఎవరో కాదు.. టాలీవుడ్‌ లేటెస్ట్‌ సెన్సేషన్‌ రాశి ఖన్నా. ఇప్పటికే 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రాశి.. అప్పటికే 'మనం'లో ఓ చిన్న పాత్ర పోషించింది. త్వరలో 'జిల్‌' సినిమాతో సందడి చేయబోతున్న రాశి.. హీరోయిన్‌గా బిజీ అవుతున్న తరుణంలో అఖిల్‌ కోసం ఐటెం భామ అవతారం ఎత్తుతుండటం విశేషమే.