Begin typing your search above and press return to search.

తారక్ హిట్ ఖన్నాకి కావల్సిందే!!

By:  Tupaki Desk   |   8 Sept 2017 3:00 PM IST
తారక్ హిట్ ఖన్నాకి కావల్సిందే!!
X
టాలీవుడ్ లో ఆఫర్లు దక్కించుకోవాలంటే చిన్న చిన్నగా సక్సెస్ అందుకుంటూ పెద్ద హీరోలను ఆకర్షించాలి. అదే తరహాలో చాలా మంది హీరోయిన్స్ కష్టపడి స్టార్స్ హీరోస్ తో ఛాన్సులను పట్టేస్తున్నారు. అలాగే అందమైన బబ్లీ గర్ల్ గా పేరు తెచ్చుకున్న రాశిఖన్నా కూడా స్టార్ హీరోస్ తో జోడి కట్టాలని చాలా కష్టపడుతోంది.

బాలీవుడ్ లో తెరగ్రేటం చేసినా.. ఇక్కడ మాత్రం అమ్మడు మొదట నుండి చిన్న హీరోలతోనే ఎక్కువ సినిమాలు చేస్తూ వస్తోంది. ముఖ్యంగా గోపిచంద్ - రవి తేజ లాంటి మీడియం స్టార్స్ తో ఛాన్సులు కొట్టేస్తూ ఇప్పుడు తారక్ వరకు వచ్చింది. గత కొంత కాలంగా అమ్మడిని అపజయాలే పలకరిస్తున్నాయి. దీంతో ఎలాగైనా ఎన్టీఆర్ "జై లవ కుశ" సినిమాతో హిట్ కొట్టాలని చూస్తోంది. ఒకవేళ అమ్మడికి ఆ సినిమా అపజయాన్ని ఇస్తే గనక ఆ ప్రభావం తరువాత సినిమాలకు ఎఫెక్ట్ అయ్యేలా ఉందంటున్నారు కొందరు. ప్రస్తుతం ఈ బబ్లీ గర్ల్ రవి తేజ - టచ్ చేసి చూడు షూటింగ్ లో బిజీగా ఉంది. అలాగే ఇతర భాషల్లో కూడా కొన్ని సినిమాలను లైన్ లో పెట్టింది. కాని వాటి రిజల్ట్ ఎలా ఉన్నా ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో తప్పకుండా హిట్ పడాలి. లేదంటే అమ్మడు చిన్న హీరోల సినిమాలకే పరిమితం అయ్యే ఛాన్స్ లేకపోలేదు.

అయితే రాశి మాత్రం సినిమాపై బాగా నమ్మకం తో ఉందట ఎందుకంటే సినిమాలో ఆమె పాత్ర చాలా బావుంటుందనే టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి రాశి ఆశలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో!!