Begin typing your search above and press return to search.

అప్పుడు రెజీనా.. ఇప్పుడు రాశీ

By:  Tupaki Desk   |   14 April 2016 10:19 PM IST
అప్పుడు రెజీనా.. ఇప్పుడు రాశీ
X
ఇప్పటికే మనకు తెలిసిన విషయం ఏంటంటే.. ''సుప్రీమ్‌'' సినిమా కోసం మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌.. ''అందం హిందోళం'' అనే పాటను రీమిక్స్‌ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలోని అన్ని పాటల టీజర్లను చూస్తుంటే మాత్రం.. అన్నింటికంటే ఎక్కువగా అదరగొట్టేసింది మాత్రం ఈ రీమిక్స్‌ పాటే. అయితే ఈ పాటలో సాయిధరమ్‌ ఎలా స్టెప్పులు ఇరగదీస్తాడు.. కాని ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి.

గతంలో సాయిధరమ్‌ తేజ్‌ 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌' సినిమాలో చూసినప్పుడు.. అక్కడ గువ్వా గోరింకతో సాంగులో మాత్రం.. సాయి కంటే ఎక్కువగా ఆకట్టుకుంది హీరోయిన్‌ రెజీనా అనే చెప్పాలి. చీరకట్టులో అమ్మడు చంపేసింది. ఇప్పుడు కూడా అంతే.. ఈ అందం హిందోళం సాంగులో.. సాయిదరమ్‌ స్టెప్పులతో అరిపించినా కూడా.. తన నడుం సోయగాలతో ఊపుతెచ్చేసింది రాశి ఖన్నా. పాటను చూస్తోంటే మాత్రం.. అమ్మడి స్టెప్పులు మత్తెక్కిస్తున్నాయి.

ఇకపోతే ఈ పాట విజువల్స్‌ ను తీసిన తీరుబట్టి.. బాగానే ఖర్చుపెట్టారని అర్ధమవుతోంది. మరి అప్పట్లో యముడికి మొగుడు సక్సెస్‌ లో ఈ పాట ఎంత ఉపయోగపడిందో.. ఇప్పుడు మావయ్య బ్లెస్సింగ్స్ తో సాయిధరమ్‌ కూడా అలాగే కానిస్తాడేమో చూడాలి