Begin typing your search above and press return to search.

తమకు లిమిట్స్ వద్దంటున్న రాశి ఖన్నా

By:  Tupaki Desk   |   12 May 2016 11:35 AM IST
తమకు లిమిట్స్ వద్దంటున్న రాశి ఖన్నా
X
సొగసు గత్తెలను - వయ్యారి భామలను ఏరి కోరి మరి సినిమాల్లో హీరోయిన్ గా ఎంచకుంటారు. ఇందుకు కారణం అందాన్ని మరింత అందంగా చూపించడం కోసమే. ఇప్పటికీ కమర్షియల్ సినిమాలంటే హీరోయిన్ ఓ పబ్లిసిటీ మెటీరియల్ అంతే. అయితే ఇలాంటి పద్ధతులకు పూర్తిగా మద్దతు ఇవ్వలేనంటోంది టాలీవుడ్ యంగ్ బ్యూటీ రాశి ఖన్నా.

'సినిమాని కమర్షియల్ గా తీయాలని అనుకోవడం.. అందుకు తగినట్లుగా హీరోయిన్ ని చూపించాలని అనుకోవడంలో తప్పు లేదు. కానీ హీరోయిన్ కేరక్టర్ ని కేవలం గ్లామర్ ప్రదర్శనకే లిమిట్ చేసేయాలని చూస్తుంటారు. కేవలం అందాల ప్రదర్శనకే అమ్మాయిలను వాడుకోవడం నాకు నచ్చదు. అంతకు మించి బోలెడంత ట్యాలెంట్ మేమూ చూపించగలం. ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ చేసుకున్నాం కూడా' అంటోంది రాశి ఖన్నా.

'నా మొదటి సినిమా ఊహలు గుసగులాడేలో చాలా ప్రాధాన్యం ఉండే పాత్ర చేశాను. ఇప్పటికీ నాకు ఇలాంటి కేరక్టర్స్ వస్తున్నాయి' అని చెబుతోంది ఈ అమ్మడు. రీసెంట్ గా విడుదలైన సుప్రీమ్ లో.. బెల్లం శ్రీదేవిగా ఫస్టాఫ్ అంతా ఈమె చుట్టూనే తిరుగుతుంది. ఈ మధ్య కాలంలో హీరోయిన్ కి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చిన సినిమా ఇదే అనే పేరు కూడా వచ్చింది. అందంతో పాటు ట్యాలెంట్ కూడా చూపిస్తానంటున్న రాశి ఖన్నా మాటలను దర్శక నిర్మాతలు పట్టించుకుంటారో లేదో!!