Begin typing your search above and press return to search.

బ్రహ్మోత్సవంపై ఆ ఎమ్మెల్యే దారుణమైన కామెంట్

By:  Tupaki Desk   |   20 Jun 2016 5:34 AM GMT
బ్రహ్మోత్సవంపై ఆ ఎమ్మెల్యే దారుణమైన కామెంట్
X
సినిమాల్లోనే కాదు.. ఏ రంగంలో గెలుపోటములు సహజం. కాబట్టి ఓ ఓటమి ఎదురైనంత మాత్రాన ఎవరి గురించైనా కించపరిచేలా మాట్లాడ్డం అన్నది భావ్యం కాదు. గత నెల విడుదలైన మహేష్ బాబు సినిమా ‘బ్రహ్మోత్సవం’ అతడి కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. ఐతే తెలుగులో ఇంకే హీరోకూ ఇలాంటి డిజాస్టర్లు లేనట్లు.. ఇంతకంటే చెత్త సినిమానే రానట్లు.. దీని మీద సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్లు చేశారు. వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అదే పనిగా మహేష్ ను టార్గెట్ చేసి అతణ్ని.. అతడి సినిమాను ట్రోల్ చేయడానికి ప్రయత్నించారు యాంటి ఫ్యాన్స్. ఐతే మెచ్యూరిటీ లేని ఇలాంటి అభిమానుల గురించి.. వాళ్ల కామెంట్ల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదు.

ఐతే ఇప్పుడు స్వయంగా ఓ ఎమ్మెల్యే ‘బ్రహ్మోత్సవం’ గురించి చేసిన కామెంట్ చూస్తే మాత్రం విస్తుపోవాల్సిందే. ఓ సినీ కార్యక్రమంలో ఇప్పుడొస్తున్న సినిమాల గురించి మాట్లాడుతూ.. ఆయన బ్రహ్మోత్సవం ప్రస్తావన తెచ్చారు. ఆ చిత్రాన్ని ‘బిచ్చగాడు’తో పోల్చి దారుణమైన కామెంట్ చేశారు. ‘‘నేను రాజకీయ రంగంలో బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడూ సినిమాలు చేస్తుంటా. ఈ మధ్య ఓ సినిమా గురించి చాలా మంచిగా విని.. థియేటరుకెళ్లి క్యూలో నిలుచుని టికెట్ కొని సినిమా చూశా. అదే.. బిచ్చగాడు. దీంతో పాటు బ్రహ్మోత్సవం సినిమా కూడా రిలీజైంది. ఐతే బిచ్చగాడు బాక్సాఫీస్ దగ్గర బ్రహ్మోత్సవం చేసుకుంటే.. బ్రహ్మోత్సవం మాత్రం కలెక్షన్లు లేక బిచ్చగాడిగా మారిపోయింది’’ అన్నారు బాలకిషన్. ఆయన చెప్పిన మాటలో భావం కరెక్టే కావచ్చు కానీ.. ఆయన మాటలు మాత్రం కరెక్ట్ కాదు. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉంటూ ఇలా అభిమానుల్ని హర్ట్ చేసే వ్యాఖ్యలు చేయడం సరి కాదు కదా.