Begin typing your search above and press return to search.
కొమురం భీమ్ కు అరుదైన ఘనత కట్టబెట్టిన ఫ్యాన్స్
By: Tupaki Desk | 2 July 2021 5:00 PM ISTఒకప్పుడు హీరోల రికార్డులు అంటే కేవలం వంద రోజులు ఎన్ని థియేటర్లలో ఆడింది.. 50 రోజులు ఎన్ని థియేటర్లలో ఆడింది.. కలెక్షన్స్ ఎంతగా సంపాదించాడు.. సిల్వర్ జూబ్లీ సినిమాలు ఎన్ని అంటూ లెక్కించే వారు. కాని ఇప్పుడు పూర్తిగా పరిస్థితి మారింది. సోషల్ మీడియా రికార్డులతో తమ హీరోల స్టార్ డమ్ ను చూపించేందుకు అభిమానులు ప్రయత్నాలు చేస్తున్నారు. రికార్డు బ్రేకింగ్ యూట్యూబ్ వ్యూస్ మొదలుకుని సోషల్ మీడియాలో పోస్ట్ కు లైక్ లు కామెంట్స్ వరకు అన్ని రికార్డులను కౌంట్ చేస్తున్నారు. ఈ విషయంలో మెగా హీరోల ఫ్యాన్స్.. మహేష్ బాబు ఫ్యాన్స్.. ప్రభాస్ ఫ్యాన్స్ మరియు నందమూరి ఫ్యాన్స్ ముందు ఉంటున్నారు. తాజాగా ఎన్టీఆర్ కోసం ఒక అరుదైన రికార్డును నందమూరి అభిమానులు క్రియేట్ చేశారు.
గత ఏడాది మే లో ఎన్టీఆర్ కొమురం భీమ్ లుక్ పోస్టర్ ను రివీల్ చేశారు. ఆ పోస్టర్ లో ఎన్టీఆర్ ఫోజ్ కు అంతా ఫిదా అయ్యారు. ఎన్టీఆర్ షేర్ చేసిన ఆ పోస్టర్ కు అరుదైన రికార్డ్ దక్కింది. ఎన్టీఆర్ అభిమానులు ఆ పోస్టర్ కు అత్యధిక కామెంట్స్ చేసి టాప్ లో నిలిపారు. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా హీరో పోస్టర్ కు కూడా ట్విట్టర్ లో రెండు లక్షల కామెంట్స్ రాలేదు. కాని ఎన్టీఆర్ కొమురం భీమ్ పోస్టర్ కు మాత్రమే ఈ అరుదైన ఘనత దక్కింది. ఎన్టీఆర్ అభిమానులు ఒక టీమ్ గా ఏర్పడి ఒకరితో ఒకరు చర్చించుకున్నట్లుగా ప్రతి ఒక్క అభిమాని కామెంట్ చేసి ఈ రికార్డును సొంతం చేసుకున్నారు. ఇప్పటికే అత్యధిక వ్యూస్ దక్కించుకున్న టీజర్ గా కూడా కొమురం భీమ్ టీజర్ నిలిచిన విషయం తెల్సిందే.
కొమురం భీమ్ పోస్టర్ రికార్డు పట్ల నందమూరి అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. పోస్టర్ విడుదల అయ్యి ఏడాది దాటిన తర్వాత కూడా ఇప్పటికి కూడా ఏమాత్రం తగ్గకుండా ఆ పోస్టర్ ను జనాలు ఆధరిస్తూనే ఉన్నారు అనేందుకు ఇదే నిదర్శణం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా లో అద్బుతమైన కొమురం భీమ్ పాత్రకు ఎన్టీఆర్ జీవం పోస్తాడనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ చిత్రీకరణలో ఎన్టీఆర్ పాల్గొంటున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా పూర్తి అయిన తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మరో వైపు జెమిని టీవీ కోసం ఎవరు మీలో కోటీశ్వరులు షో ను చేయబోతున్నాడు.
ఇక ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ కాంబో సినిమా కూడా రాబోతుంది. ఈ సినిమా లకు మరియు టీవీ షో కు కూడా రికార్డులను కట్టబెట్టేందుకు అభిమానులు కాచుకు కూర్చుకున్నారు. ఆర్ ఆర్ ఆర్ లో కొమురం భీమ్ పాత్రకు గాను ఎన్టీఆర్ ప్రత్యేకంగా రెడీ అయ్యాడని.. ఆయన సరసన ఉండే హీరోయిన్స్ విషయంలో కూడా జక్కన్న చాలా జాగ్రత్తలు తీసుకుని సినిమాను తెరకెక్కించినట్లుగా ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు. యాక్షన్ సన్నివేశాల్లో చరణ్ తో ఎన్టీఆర్ సన్నివేశాలు అద్బుతంగా ఉంటాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.