Begin typing your search above and press return to search.

రేర్ క్లిక్: ద‌ర్శ‌క‌మ‌ణితో ద‌ర్శ‌క‌ధీర ఆర్య సుక్కూ

By:  Tupaki Desk   |   9 April 2022 10:30 AM GMT
రేర్ క్లిక్: ద‌ర్శ‌క‌మ‌ణితో ద‌ర్శ‌క‌ధీర ఆర్య సుక్కూ
X
సౌతిండియా లెజెండ‌రీ ద‌ర్శ‌కుడిగా మ‌ణిర‌త్నం పాపులారిటీ గురించి తెలిసిందే. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా గౌర‌వం అందుకుంటున్న వెట‌ర‌న్ మ‌ణిర‌త్నం ప్ర‌స్తుత ప‌రిస్థితిలో నెమ్మ‌దిగా సినిమాల రూప‌క‌ల్ప‌న చేస్తున్నారు.

ఇక ఇండియ‌న్ సినిమాకే యూనిక్ టెక్నిక్ ని నేర్పిన గురువుగా ఆయ‌న‌ను ఇత‌ర భాష‌ల ద‌ర్శ‌కులు టెక్నీషియ‌న్స్ ఎంతో గౌర‌విస్తారు.

అయితే అంత‌టి దిగ్గ‌జంతో క‌లిసి ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి.. ఆర్య సుక్కూ క‌నిపించ‌డం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంత‌కీ ఆ ముగ్గురు క‌లిసారు.. ఏం జ‌ర‌గ‌బోంది? అంటూ క్యూరియాసిటీ పెరిగింది.

ప్ర‌స్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వైర‌ల్ గా మారాయి. అయితే ఆ ముగ్గురూ దేని కోసం క‌లిసారు అంటే.. సీఐఐ ద‌క్షిణ్ సౌతిండియా మీడియా అండ్ మీడియా ఎంట‌ర్ టైన్ మెంట్ స‌మ్మిట్ ఆరంభ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు విచ్చేశారు.

ఆ స‌మ‌యంలో అలా తీరిక వేళ పిచ్చా పాటీ మాట్లాడుతూ రాజ‌మౌళి- సుకుమార్ ఇలా కెమెరా కంటికి చిక్కారు. ఈ స‌మ్మిట్ లో ద‌క్షిణాది ప్ర‌ముఖ సెల‌బ్రిటీలు చాలామంది పాల్గొన్నారు.

అన్న‌ట్టు ఆ ముగ్గురూ గ్రేట్ టెక్నీషియ‌న్స్ గా పాపుల‌ర‌య్యారు. హాలీవుడ్ త‌ర‌హాలో ఏదైనా భారీ ప్రాజెక్ట్ కి ప‌ని చేస్తారా? జురాసిక్ పార్క్- అవెంజ‌ర్స్ లో సంచ‌ల‌నం అయ్యే సిరీస్ ని ప్లాన్ చేస్తారా..! అంటూ అభిమానుల మైండ్ లో డౌట్స్ పుట్టుకొచ్చాయి. ఒక‌వేళ అదే నిజ‌మైతే ఇండియా బెస్ట్ ఫ్రాంఛైజీని క్రియేట్ చేయ‌డం సాధ్య‌మ‌వుతుందేమో!