Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా స్టార్ తో రేర్ ఛాయిస్..!

By:  Tupaki Desk   |   18 Jun 2021 9:00 AM IST
పాన్ ఇండియా స్టార్ తో రేర్ ఛాయిస్..!
X
కేజీఎఫ్ స్టార్ గా జాతీయ స్థాయిలో య‌ష్ కి ఉన్న పాపులారిటీ ఇమేజ్ గురించి తెలిసిందే. అత‌డు న‌టిస్తున్న కేజీఎఫ్ 2 సంచ‌ల‌నాలు సృష్టించ‌డం ఖాయ‌మ‌న్న టాక్ వినిపిస్తోంది. బంగారు గ‌నుల మాఫియా క‌థాంశంతో ప్ర‌శాంత్ నీల్ మ‌రోసారి సంచ‌ల‌నాల‌కు తెర తీస్తార‌ని అభిమానులు అంచ‌నా వేస్తున్నారు.

ఇక పాన్ ఇండియా స్టార్ గా వెలిగిపోతున్న య‌ష్ త‌దుప‌రి ఏ ద‌ర్శ‌కుడితో ప‌ని చేస్తారు? అన్న‌ది గ‌త కొంత‌కాలంగా హాట్ టాపిక్ గా మారింది. అయితే రాఖీ భాయ్ య‌ష్ త‌న మూలాల్ని మ‌రువ‌లేదు. ప్ర‌శాంత్ నీల్ కి అవ‌కాశం క‌ల్పించిన‌ట్టే క‌న్న‌డ రంగంలోని మ‌రో ద‌ర్శ‌కుడికి య‌ష్ అవ‌కాశ‌మిస్తున్నారు. కెజిఎఫ్: చాప్టర్ 2 త‌ర్వాత‌ యష్ తన తదుపరి చిత్రానికి నార్తన్ దర్శకత్వంలో సంతకం చేసాడు. చిత్రీక‌ర‌ణ‌ త్వరలో ప్రారంభమవుతుంది.

పాన్ ఇండియన్ కేట‌గిరీలో తెర‌కెక్క‌నున్న‌ ఈ యాక్షన్ థ్రిల్లర్ లో యష్ నేవీ అధికారిక‌గా క‌నిపిస్తారు. ఈ చిత్రంలో త‌మ‌న్నా లేదా కియ‌రా క‌థానాయిక‌గా న‌టించే వీలుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. జీ స్టూడియోస్ - హోంబాలే ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తాయి. త్వరలో అధికారిక ప్రకటన వెలువ‌డ‌నుంది. ఇక ఈ మూవీతో నార్త‌న్ పేరు పాన్ ఇండియా లెవ‌ల్లో పేరు మార్మోగ‌డం ఖాయమ‌ని భావిస్తున్నారు. నార్త‌న్ ఇంత‌కుముందు మ‌ఫ్టీ అనే యాక్ష‌న్ చిత్రాన్ని తెర‌కెక్కించారు.