Begin typing your search above and press return to search.

టాలీవుడ్ గొప్ప నటుడుకి నటన అంటే ఆసక్తే లేదట

By:  Tupaki Desk   |   13 April 2020 1:45 PM IST
టాలీవుడ్ గొప్ప నటుడుకి నటన అంటే ఆసక్తే లేదట
X
టాలీవుడ్ చరిత్రలో గొప్ప నటులు కొందరే ఉన్నారు. వారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. 80వ దశకంలో టాలీవుడ్ విలన్ గా చెలరేగిపోయిన ‘రావు గోపాలరావు’ నటనా కౌశలానికి ఎన్నో ప్రశంసలు దక్కాయి. ఇప్పటికీ ఆయన బతికి లేకున్నా.. ఆయన చిత్రాల ద్వారా గొప్ప విలన్ గా తెరపై కనిపిస్తుంటారు.

అయితే ఇండస్ట్రీలో డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన వారు ఎంతో మంది ఉన్నారు. తండ్రి రావు గోపాల్ రావు గొప్ప నటుడు అయినా ఆయన వారుసుడు రావు రమేష్ మాత్రం నటుడిగా అవ్వాలని అనుకోలేదట.. ఇదో విచిత్రమే మరీ..

రావు రమేష్.. నిజంగా టాలీవుడ్ కు దొరికిన ఒక మణిపూస.. తండ్రి రావు గోపాల్ రావు పేరును నిలబెడుతూ నటనలో అంతకుమించిన ప్రతిభను కనబరుస్తున్నాడు. బాలయ్య నటించిన ‘సీమ సింహం’తో రావు రమేష్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘కొత్త బంగారులోకం’, గమ్యంతో నటనలో మంచి గుర్తింపు దక్కింది. ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ తో టాలీవుడ్ లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ప్రస్తుతం బిజీ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న రావు రమేష్ కు నటనపై అస్సలు ఆసక్తి లేదట.. ఈ విషయాన్ని స్వయంగా ఆయన చెప్పడం విశేషం.

రావురమేష్ సినిమాల్లో గొప్ప దర్శకుడిని కావాలని కలలుగన్నాడట.. ఇదే విషయం వాళ్ల అమ్మకు కూడా చెప్పాడట.. కానీ వాళ్ల అమ్మ నో చెప్పిందట.. దర్శకుడికి 24 క్రాఫ్ట్స్ తెలిసి ఉండాలని.. సమకాలనీ జీవితాలు ఆవపోసన పట్టి ఉండాలని.. దర్శకత్వం అంటే ముళ్లబాట అని.. తర్వాతే వెలుగు వస్తుందని.. నీకు దర్శకత్వం కంటే నటించడం చాలా తేలిక అని హితబోధ చేసిందట..

అలా డైరెక్టర్ కావాల్సిన రావు రమేశ్.. వాళ్ల అమ్మ సూచన మేరకు తండ్రి బాటలో నటుడయ్యాడు. గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నాడట..