Begin typing your search above and press return to search.

రావు రమేష్‌.. వర్షన్‌ 2.0 అంటున్నారు

By:  Tupaki Desk   |   20 May 2016 4:17 AM GMT
రావు రమేష్‌.. వర్షన్‌ 2.0 అంటున్నారు
X
రొబో.. వర్షన్‌ 2.0.. అంటూ శంకర్‌ తన కొత్త సినిమా టైటిల్‌ ను చెప్పాడు కాబట్టి.. ఖచ్చితంగా ఇప్పుడు అందరూ అదే ఫాలో అవుతుంటారు. ఇక ఓవర్‌ సీస్‌ లో ''బ్రహ్మోత్సవం'' సినిమాను చూసిన వాళ్ళందరూ.. ఒక యాక్టర్‌ మాత్రం ఆకాశానికి ఎత్తేస్తున్నారు. పదండి అసలు ఏంటో చూద్దాం.

శ్రీకాంత్‌ అడ్డాల డైరక్షన్‌ లో మహేష్‌ బాబు హీరోగా వచ్చిన ''బ్రహ్మోత్సవం'' సినిమా.. ఈరోజే విడుదలవుతోంది. ఆల్రెడీ ఓవర్‌ సీస్‌ ప్రీమియర్లు.. వగైరా వగైరా షోలన్నీ.. సినిమాకు పాజిటివ్‌ టాక్‌ నే తెచ్చాయి. ఈ సినిమాలో క్యారెక్టర్‌ ఆర్టిస్టు రావు రమేష్‌ క్యారెక్టర్‌ మరోసారి అదిరిపోయింది. గత శ్రీకాంత్‌ అడ్డాల సినిమాలన్నింటిలోనూ ఆయన క్యారెక్టర్‌ సూపర్బే. బ్రహ్మోత్సవం లో ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ లో వచ్చే రావు రమేష్‌ పెర్ఫామెన్స్‌ జనాలను చప్పట్లు కొట్టించిందట. ఇప్పటివరకు తను చేసిన రోల్స్‌ ను తనే బీట్‌ చేసుకొని.. వర్షన్‌ 2.0 అనిపించుకున్నాడట.

అంతే కాదు.. అసలు ఒక పెద్ద స్టార్‌ సినిమాలో.. ఆ స్టార్‌ తో పాటు పక్కనోళ్ళ పెర్ఫామెన్స్ కు చప్పట్లు కొట్టడం అంటే.. ఎంతగా సదరు నటుడు క్యారెక్టర్‌ లో ఇమిడిపోయి ఇంప్రెస్ చేశాడో చూడండి అంటున్నారు కొందరు సినిమా లవర్స్‌. ఇప్పుడు.. ఆ రావు రమేష్‌ ను అలా వదిలేయకండయ్యా.. అతడికి ఇంకాసిన మాంచి క్యారెట్టర్లు ఇవ్వండేసా!!