Begin typing your search above and press return to search.

ఆ కేరక్టర్ అదుర్స్ అంటున్నారు

By:  Tupaki Desk   |   15 March 2016 5:30 PM GMT
ఆ కేరక్టర్ అదుర్స్ అంటున్నారు
X
రావు రమేష్.. సినిమా కెరీర్ ని ఆలస్యంగా స్టార్ట్ చేసినా.. ప్రస్తుతం పీక్ స్టేజ్ కి చేరిపోయాడు. కేరక్టర్లను పండించడంలో తన శైలి వైవిధ్యమైన నటనను చూపిస్తున్నాడు. దాదాపు చేసిన ప్రతీ మూవీలోనూ వేరియేషన్ చూపిస్తూ.. ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాడు రావు రమేష్. ఇప్పుడు నితిన్ - సమంత జంటగా నటించిన అ..ఆ.. మూవీలోనూ ఈ కేరక్టర్ ఆర్టిస్ట్ పాత్ర అద్భుతంగా ఉంటుందని అంటున్నాయి యూనిట్ వర్గాలు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో వరుసగా కనిపిస్తున్నాడు రావు రమేష్. జులాయి - అత్తారింటికి దారేది - సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల్లో కూడా కీలక పాత్రలు చేసిన రావు రమేష్.. ఈసారి అంతకంటే ప్రాధాన్యత ఉండే రోల్ లో నటించాడట. ఈ కేరక్టర్ పై ప్రత్యేకమైన మక్కువతో.. సూపర్బ్ గా తీర్చిదిద్దాడట త్రివిక్రమ్. ఔట్ పుట్ కూడా సూపర్ గా ఉందని.. థియేటర్లలో రావు రమేష్ పాత్ర బాగా కనెక్ట్ అవుతుందని అంటున్నారు.

రొమాంటిక్ ఎంటర్ టెయినర్ గా రూపొందిన అ..ఆ.. కి అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి అనేది ట్యాగ్ లైన్. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా.. ఎస్ రాధాకృష్ణ నిర్మాత. మే 6న తేదీన థియేటర్లలోకి తెస్తామని అ..ఆ.. యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది.