Begin typing your search above and press return to search.

కేరక్టర్ ఆర్టిస్టుకు కోటి రూపాయలా?

By:  Tupaki Desk   |   30 Sep 2015 3:51 PM GMT
కేరక్టర్ ఆర్టిస్టుకు కోటి రూపాయలా?
X
ప్రకాష్ రాజ్ ని చూసీచూసీ బోర్ కొట్టేసిన పరిస్థితిలో.. అతనికి కరెక్ట్ ప్రత్యామ్నాయంగా మారాడు రావు రమేష్. తండ్రి రావు గోపాలరావు పేరు చెప్పుకోకుండా.. కేవలం యాక్టింగ్ తోనే ఇండస్ట్రీలో పాతుకుపోయాడు. ఇప్పుడు ఇతగాడికి ఎంతగా డిమాండ్ పెరిగిందంటే.. సినిమాకి ఇంత అని కాకుండా... రోజుల లెక్కన రెమ్యూనరేషన్ వసూలు చేసుకుంటున్నాడు.

ఇప్పుడు రావు రమేష్ పారితోషకం ఎంతో తెలుసా. రోజుకు 4 లక్షలు. ఇదే రికార్డ్ అమౌంట్ అనుకుంటే.. మహేష్ బ్రహ్మోత్సవం కోసం ఏకంగా కోటి రూపాయలు పుచ్చుకోవడం సెన్సేషన్ అయిపోయింది. ఈ మూవీ కోసం 36 రోజుల కాల్షీట్స్ అడిగారట రావు రమేష్ ని. మనోడు పుచ్చుకునే లెక్క ప్రకారం కోటీ 44 లక్షలు ఇచ్చుకోవాలి. సింగిల్ పేమెంట్ గా కోటికి కమిట్ అయ్యారని టాక్ వినిపిస్తోంది.

ఎక్కువ డేట్స్ అడిగితే ఏమైనా కమెడియన్స్ కూడా కోట్లు అడిగే రోజులువి. అలాంటిది ట్యాలెంట్ ఉన్నోడికి ఆ మాత్రం ఇచ్చుకుంటే తప్పేముంది అనుకుంటున్నారు టాలీవుడ్ లో.