Begin typing your search above and press return to search.
ఎవరన్నా ఆ రోల్ ఇస్తే బాగుండు
By: Tupaki Desk | 30 May 2016 11:11 AM ISTటాలీవుడ్ లో కేరక్టర్ ఆర్టిస్టులకు కొదువ లేదు. అయితే ఎంత మంది ఉన్నా.. తనకు, తన నటనకూ ఓ ప్రత్యేకత ఆపాదించుకున్నాడు రావు రమేష్. సినిమా సినిమాకి ఇంప్రూవ్ అవుతూ, విభిన్నత చూపిస్తూ.. ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాడు. ఏ కేరక్టర్ అయినా తనదైన శైలిలో మెప్పిస్తున్నాడు రావు రమేష్.
ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కేరక్టర్ ఆర్టిస్టుల్లో రావు రమేష్ ఒకడంటే ఏ మాత్రం ఆశ్చర్యం అవసరం లేదు. మరి ప్రస్తుతం తను చేస్తున్న పాత్రలు సంతృప్తినిచ్చాయా.. వేరే ఏదైనా పాత్ర చేయలేదనే అసంతృప్తి ఉందా అంటే మాత్రం.. ఓ ఆసక్తికర సమాధానం చెప్పాడు రావు రమేష్. ఇప్పటివరకూ చాలానే రోల్స్ చేసినా.. ఒక పాత్ర మాత్రం ఇంకా ఎవరూ ఆఫర్ చేయలేదట. ఆ రోల్ చేయాలని ఎవరైనా అడిగితే.. అది తనకు కూడా సవాలే అని.. అయినా మెప్పించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తానని అంటున్నాడు.
'నాకు బాగా మోటుగా ఉండే ఓ విలన్ రోల్ చేయాలని కోరిక. ఆ పాత్ర నాలోని నటుడిని మరింత బయటకు తెస్తుందని అనుకుంటున్నా. నాపై ఎవరైనా ఈ బాధ్యతను పెడితే.. మోయడానికి సిద్ధం. నేు చేయాలని చూస్తున్న రోల్ ఇదే' అని చెప్పాడు రావు రమేష్. మరి ఇలాంటి మోటు విలన్ కేరక్టర్ ని రావు రమేష్ కి ఇచ్చేదెవరో?