Begin typing your search above and press return to search.
రావు గోపాల్ రావు సతీమణి ఇక లేరు
By: Tupaki Desk | 7 April 2018 10:47 AM ISTప్రముఖ హరికథ కళాకారిణి.. దివంగత విఖ్యాత నటుడు రావు గోపాల్ రావు సతీమణి.. మరియు ప్రస్తుత బిజీ క్యారక్టర్ ఆర్టిస్ట్ అయిన రావు రమేష్ తల్లి.. శ్రీమతి కమలా కుమారి తనువు చాలించారు.
73 ఏళ్ల కమలా కుమారి గత కొంత కాలంగా వృధ్దాప్య సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్నారు. ఈరోజు ఉదయం ఆవిడ మృతి చెందినట్లు తెలుస్తోంది. రావు గోపాల్ రావు మరియు కమలా కుమారి దంపతులకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు రావు రమేష్ నటుడిగా స్థిరపడిన సంగతి తెలిసిందే. అయితే 1994లో 57 ఏళ్ళ రావు గోపాల్ రావు మృతి చెందాక.. కుటుంబ బాధ్యతలను ఆమే నిర్వర్తించారు. దాదాపు మన చుట్టుపక్కలున్న అని రాష్ట్రాల్లోనూ ఆమె హరికథ ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆమె తండ్రి కూడా హరికథ కళాకారుడు కావడంతో.. ఆమె చిన్నతనం నుండే సదరు కళలో పట్టుసాధించారు.
తుపాకి డాట్ కామ్ వారి కటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తోంది.