Begin typing your search above and press return to search.

ఒకేసారి ముగ్గురి హీరోయిన్స్ తో రణ్ వీర్ సర్‌ప్రైజ్‌

By:  Tupaki Desk   |   11 Jun 2022 5:00 AM IST
ఒకేసారి ముగ్గురి హీరోయిన్స్ తో రణ్ వీర్ సర్‌ప్రైజ్‌
X
బాలీవుడ్ టాలెంటెడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఊహించని కొత్త పాయింట్ ఓ వర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక వేగంగా జనాలను థియేటర్లకు రప్పించే అతి కొద్ది మంది హీరోల లో రణ్ వీర్ మొదటి స్థానంలో ఉంటాడు అని చెప్పవచ్చు. అతని సినిమాలకు కాస్త పాజిటీవ్ టాక్ వచ్చినా కూడా ఈ తరం ప్రేక్షకులు థియేటర్ల వద్ద క్యూ కడుతుంటారు.

అలాగే తన సినిమాను ప్రమోట్ చేసే విధానంలో కూడా చాలా తెలివిగా అడుగులు వేస్తూ ఉంటాడు. దర్శకనిర్మాతల కంటే ముందుగానే అతను సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు.

ఇక చివరగా అతను తీసిన 83 సినిమా బాక్సాఫీస్ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. 1983 వరల్డ్ కప్ ఆధారంగా తెరకెక్కిన ఆ సినిమా కష్టానికి తగ్గ ఫలితం అందించకపోవడంతో ఇప్పుడు ఎలాగైనా తన తదుపరి సినిమాతో సక్సెస్ కావాలని చూస్తున్నాడు.

అయితే ఆ సినిమాలో ఒకేసారి ముగ్గురు హీరోయిన్స్ తో కలిసి ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. కరణ్ జోహార్ దర్శకత్వంలో రణవీర్ సింగ్, అలియా భట్ జంటగా నటిస్తున్న చిత్రం రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ కూడా పూర్తికానుంది. ఇక తాజా అప్‌డేట్ ప్రకారం, అనన్య పాండే, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాటలో అలరించనున్నారనే టాక్ వినిపిస్తోంది.

కరణ్ జోహార్ తన చిత్రాలలో స్టార్ హీరోయిన్లను స్పెషల్ పాత్రలలో సర్ ప్రైజ్ చేస్తూ ఉంటారు. ఇక ఈసారి కూడా రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ సినిమాలో కూడా అదే తరహాలో స్టార్ క్యాస్ట్ తో హైలెట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.. రణ్ వీర్ తో కలిసి అనన్య పాండే, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ ముగ్గురు కూడా స్పెషల్ సాంగ్ తో మెప్పించనున్నట్లు తెలుస్తోంది. మరి ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.