Begin typing your search above and press return to search.

అల్లాడిన్ మ‌న‌సు గెలిచిన గ‌ల్లీబోయ్‌!

By:  Tupaki Desk   |   17 Feb 2019 6:55 AM GMT
అల్లాడిన్ మ‌న‌సు గెలిచిన గ‌ల్లీబోయ్‌!
X
ప్రపంచంలోనే కాస్ట్ లీ హీరో ఎవ‌రు? అత్యంత భారీ పారితోషికం అందుకునే టాప్ స్టార్ ఎవ‌రు? అంటే అందులో క‌చ్ఛితంగా విల్ స్మిత్ పేరు ఉంటుంది. `మెన్ ఇన్ బ్లాక్` సిరీస్ స‌హా ఐ రోబో, లెజెండ్ వంటి ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో క‌థానాయ‌కుడిగా న‌టించిన విల్ స్మిత్ కి ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీరాభిమానులు ఉన్నారు. ఇండియాలోనూ అత‌డి ఫ్యాన్ ఫాలోయింగ్ త‌క్కువేమీ కాదు. ఒక న‌ల్ల జాతీయుడి అసాధార‌ణ జైత్ర‌యాత్ర‌కు అత‌డో బ్రాండ్ అంబాసిడ‌ర్. ఇటీవ‌లే `అల్లాఉద్దీన్ అద్భుత దీపం` టీజ‌ర్ రిలీజైన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో అల్లాఉద్దీన్ పాత్ర‌లో త‌ళుక్కున మెరిసి ఆక‌ట్టుకున్నాడు విల్ స్మిత్.

అయితే అంత గొప్ప స్టార్ మ‌న‌సు దోచాడు బాలీవుడ్ గ‌ల్లీబోయ్ ర‌ణ్‌ వీర్ సింగ్. వ‌రుస హిట్ల‌తో జోరుమీదున్న ర‌ణ‌వీర్ న‌టించిన తాజా చిత్రం `గ‌ల్లీ బోయ్` క్రిటిక్స్ ప్ర‌శంస‌ల‌తో పాటు టాప్ స్టార్ల మ‌న్న‌న‌లు అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా వీక్షించిన విల్ స్మిత్ ర‌ణ‌వీర్ పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు. ``యో.. ర‌ణ్‌ వీర్ కంగ్రాట్స్ మ్యాన్.. గ‌ల్లీ బోయ్ గా నువ్వు చేసిన‌దానిని నేను ప్రేమిస్తున్నా. నా పాత స్కూల్లో హిప్ హాప్ గుర్తుకొచ్చింది. ప్ర‌పంచం మొత్తం నీ హిప్ హాప్ చూస్తోంది. ఐ యామ్ ల‌వింగ్ ఇట్ మ్యాన్ .. గో గెట్.. ఎమ్‌!`` అంటూ ఎంతో ఎగ్జ‌యిట్ అవుతూ సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌శంస‌లు కురిపించారు విల్ స్మిత్.

ఈ ప్ర‌శంస జాతీయ అవార్డును మించినంత అని గ‌ల్లీ బోయ్ ఫీల‌వుతాడ‌న‌డంలో సందేహం లేదు. ప్రేమికుల రోజు కానుక‌గా రిలీజైన గ‌ల్లీబోయ్ భారీ ఓపెనింగ్స్ సాధించి పెద్ద హిట్ అన్న టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకి ఎంచుకున్న క‌థాంశం, ద‌ర్శ‌కురాలు జోయా అక్త‌ర్ ప్ర‌తిభ‌కు గొప్ప పేరొచ్చింది. ర‌ణ‌వీర్ - ఆలియా జంట న‌ట‌న‌కు అంతే ఐడెంటిటీ ద‌క్కింది. ధారావి నుంచి వ‌చ్చి ఎదిగిన‌ ఇద్ద‌రు ర్యాప‌ర్స్ ఒరిజిన‌ల్ జీవిత‌క‌థ‌ను జోయా అద్భుతంగా తెర‌కెక్కించార‌ని ప్ర‌శంస‌ల‌ జ‌ల్లు కురుస్తోంది. విల్ స్మిత్ ప్ర‌శంస‌ల‌పై నెటిజనులు సైలెంట్ గా లేరు. ర‌ణ‌వీర్ సైతం ఆ ఆనందాన్ని దాచుకోలేక‌పోతున్నాడు. త‌న అభిమానుల‌కు ఆ విష‌యాన్ని షేర్ చేశాడు. పెద్ద‌న్నా ఇది చాలా హార్డ్.. నీకు స‌లాం!! అని ర‌ణ‌వీర్ విల్ స్మిత్ కి రిప్ల‌య్ ఇచ్చాడు.