Begin typing your search above and press return to search.

హీరో ల‌గ్జ‌రీ కార్ గ‌డువు ముగిసినా కానీ..!

By:  Tupaki Desk   |   19 Oct 2022 4:43 AM GMT
హీరో ల‌గ్జ‌రీ కార్ గ‌డువు ముగిసినా కానీ..!
X
బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ ర‌ణ‌వీర్ సింగ్ పై సోషల్ మీడియా ఆరోప‌ణ‌లు సంచ‌ల‌నంగా మారాయి. ఆయ‌న త‌న ల‌గ్జ‌రీ కార్ ని గడువు ముగిసిన రిజిస్ట్రేషన్ ను ఉపయోగించి డ్రైవ్ చేసిన‌ట్టు ఆరోపిపణలు వ‌చ్చాయి.

ముంబై విమానాశ్రయంలో ఇటీవల షైనీ నీలిరంగు ఆస్టన్ మార్టిన్ ను నడుపుతూ ర‌ణ‌వీర్ కెమెరా కంటికి చిక్కాడు. రణవీర్ తన అభిమాన లగ్జరీ కారును నడుపుతున్న వీడియో ఆన్ లైన్ లో వైరల్ అయ్యింది. తన లైసెన్స్ గడువు ముగిసినప్పుడు డ్రైవింగ్ చేశాడని ఒక సోష‌ల్ మీడియా వినియోగదారు తన ట్వీట్ లో ముంబై పోలీసులను ప్రస్తావించి వాటిని ట్యాగ్ చేశాడు.

ముంబై పోలీసులు రణ్ వీర్ సింగ్‌పై కఠినమైన చర్యలు తీసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేసాడు. ర‌ణ‌వీర్ నడిపిన కారుకు భీమా లేద‌ని కూడా అత‌డు తెలిపాడు. కార్ లైసెన్స్ ప్లేట్ లో తేదీ సోషల్ మీడియాలో వైర‌ల్ అయిన‌ ఫోటో ప్రకారం 28 జూన్ 2020 గా ఉంది. దీనికి వెంట‌నే ముంబై ట్రాఫిక్ పోలీసులు నెటిజ‌న్ కి బదులిచ్చారు. అయితే దీనిపై ర‌ణవీర్ నుంచి ఎలాంటి స్పంద‌నా లేదు.

అయితే త‌మ అభిమాన స్టార్ రణ్ వీర్ ని అవ‌మానించినందుకు అభిమానులు స‌ద‌రు నెటిజ‌నుడిపై తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేస్తూ ట్రోల్ చేయడం ప్రారంభించారు. ట్రాఫిక్ పోలీసులకు వివరాలు రావడంతో ఫిర్యాదు చేశారు. లైసెన్స్ గడువు ముగియ‌లేద‌ని అభిమానులు ఆధారాల‌తో పోలీసుల‌కు నివేదించారు. తాను చేసింది తప్పు అని తెలుసుకున్న తరువాత వినియోగదారు తన ట్వీట్ ను తొలగించి ర‌ణ‌వీర్ కి క్షమాపణలు చెప్పడంతో క‌థ సుఖాంత‌మైంది.

కెరీర్ ప‌రంగా బిజీ బిజీ..!బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి మాస్ మసాలా యాక్ష‌న్ ఎంట‌ర్ టైనర్ `సింబా`తో ర‌ణ‌వీర్ పెద్ద‌ హిట్టు కొట్టాడు. ఆ తర్వాత వీరిద్దరూ `సర్కస్`తో వస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇటీవ‌ల‌ ఆవిష్కరించారు. ఇందులో ర‌ణ‌వీర్ ని రెండు విభిన్న‌మైన గెట‌ప్పులు వైవిధ్య‌మైన ఆహార్యంతో చూపించ‌బోతున్నార‌ని పోస్ట‌ర్ చెబుతోంది. ఇదే నిజ‌మైతే హీరో రణ్ వీర్ త‌న కెరీర్ లోనే సింగ్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారని భావించాలి. ఫస్ట్ లుక్ పోస్టర్ లో రణ్ వీర్ ను రెండు విభిన్న గెటప్ లలో చూపించారు. అయితే స్వ‌ల్పంగా మాత్ర‌మే రూపురేఖ‌ల‌ను మార్చారు. ఆ ఇద్ద‌రూ క‌వ‌ల‌లుగా క‌నిపిస్తార‌ని టాక్ వినిపిస్తోంది.

ఇందులో రణ్ వీర్ తో పాటు హాస్యనటుడు వరుణ్ శర్మ కూడా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. పూజా హెగ్డే - జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గ్లామర‌స్ నాయికలుగా అల‌రించ‌నున్నారు. మొత్తంమీద ఫస్ట్ లుక్ ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించింది. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. నిర్మాతలు ఈ సంవత్సరం క్రిస్మస్ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికి మూడు వారాల ముందే విడుద‌ల చేస్తే క‌లిసొస్తుంద‌ని ప్లాన్ చేస్తున్నారు. రోహిత్ శెట్టి పిక్చర్స్ - టి సిరీస్ బ్యానర్లు సంయుక్తంగా స‌ర్కస్ ని అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నాయి. ట్రైలర్ దీపావళి పండుగకు విడుదల చేయాలని భావిస్తున్నారు. ట్రైల‌ర్ తో మ‌రింత హైప్ పెర‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ర‌ణ‌వీర్ న‌టించిన ఇటీవ‌లి చిత్రాలు వ‌రుస‌గా ఫ్లాపైన సంగ‌తి తెలిసిందే. కంబ్యాక్ కోసం అత‌డు తీవ్రంగా శ్ర‌మిస్తున్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.