Begin typing your search above and press return to search.

విలన్ కూడా స్టెప్పులు ఇరగదీసేస్తే..

By:  Tupaki Desk   |   30 Jan 2018 9:44 AM GMT
విలన్ కూడా స్టెప్పులు ఇరగదీసేస్తే..
X
మన దేశంలో సినిమాలు అంటే ఓ ఫార్మాట్ ఉంటుంది. సహజంగా పాటలు.. డ్యాన్సులు అన్నీ హీరోలకు మాత్రమే ఉంటాయి. అడపాదడపా కమెడియన్స్ తో కూడా స్టెప్పులు వేయించడం పరిపాటి. కానీ విలన్ పాత్రధారికి మాత్రం అప్పుడప్పుడే ఈ అవకాశం చిక్కుతుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన బాలీవుడ్ మూవీ పద్మావత్ లో అలాంటి సందర్భమే ఒకటి కుదిరింది.

ఖలీబలీ అంటూ ఓ అద్భుతమైన పాట ఈ సినిమాలో ఉంది. గతంలో లిరికల్ సాంగ్ ను మాత్రమే విడుదల చేయగా.. సినిమా చూసిన ప్రేక్షకులు ఈ పాటను చూసి ముగ్ధులు అయిపోయారు. ఇప్పుడు యూట్యూబ్ లో ఈ పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు అతి పెద్ద అస్సెట్ గా రణవీర్ సింగ్ నిలిచాడు. పద్మావత్ మూవీకి రణవీర్ విలన్ అయినా సరే.. ఈ పాట మాత్రం హీరో సాంగ్ కు ఏ మాత్రం తగ్గని రేంజ్ లో ఉంది. అంతే కాదు.. స్టెప్పులు అయితే రచ్చ మ్యాక్స్ అనాల్సిందే. గణేష్ ఆచార్య కంపోజ్ చేసిన ఈ స్టెప్స్.. ప్రేక్షకులను మైమరపించేస్తున్నాయి.

సంగీతం.. సిట్యుయేషన్.. దర్శకుని ప్రతిభ.. అబ్బో అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరేయగా.. విలన్ పాత్ర క్రూరత్వాన్ని చాటుతూ క్లిష్టమైన స్టెప్పులను కూడా అవలీలగా వేసేసిన రణవీర్ సింగ్ ను ఎంత ప్రశంసించినా తక్కువే. విలన్ గా నటనలోనే కాకుండా.. తన డ్యాన్సులతో కూడా ఆకట్టుకున్నాడు రణవీర్ సింగ్. పద్మావత్ చిత్రానికి దీపికా పదుకొనే మాత్రమే కాకుండా.. తాను ఎంతటి ఇంపార్టెంట్ అనే విషయాన్ని నిరూపించుకున్నాడు.