Begin typing your search above and press return to search.

హీరో కోసం విప్పేసి విసిరేస్తున్నారు!!

By:  Tupaki Desk   |   16 Aug 2016 1:21 PM GMT
హీరో కోసం విప్పేసి విసిరేస్తున్నారు!!
X
బాలీవుడ్ యంగ్ హీరో రణవీర్ సింగ్ అంటే బోలెడు మంది అమ్మాయిలు పడి చస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ కుర్ర హీరో ఎక్కడికెళ్లినా అక్కడ ఎక్కువగా ఆడ అభిమానులే చుట్టు ముట్టేస్తుంటారు. ప్రస్తుతం బేఫికర్ మూవీ కోసం స్విట్జర్లాండ్ లో చక్కర్లు కొడుతున్న రణవీర్ సింగ్.. అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్న ఓ సూపర్బ్ పిక్చర్ బయటకొచ్చింది.

రణవీర్ సింగ్ కోసం అర డజన్ మంది అమ్మాయిలు.. టాప్ లెస్ గా నుంచుని ఉంటారు. అందరూ తమ చేతుల్లోని బ్రాలను విసిరేస్తుండగా.. కరెక్ట్ టైమ్ లో క్లిక్ చేసిన పిక్చర్ ఇది. ఒక్కడి కోసం ఆరుగురు అమ్మాయిలు బ్రాలు విప్పేసి విసిరేయడమంటే చెప్పుకోవాల్సిన విషయమే. పైగా.. అటు మంచు కొండలను.. ఇటు ప్రకృతిని.. వెనుక ఉన్న అమ్మాయిల చేష్టలను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నట్లుగా మనోడి పోజ్ కూడా బాగానే సెట్ అయింది. స్విట్జర్లాండ్ లో కూడా ఈ హీరోకి ఇంత క్రేజ్ ఉందా అనిపించక మానదు.

కానీ ఈ ఆరుగురిలో ఐదుగురు ఒకే టైపు టోపీలు పెట్టుకుని ఉండడం.. అందరూ యూనిఫాం టైపులో డ్రెస్సింగ్ చేసుకుని ఉండడం గమనిస్తే.. సాంగ్ షూటింగ్ చేసేందుకు పిలిపించిన అమ్మాయిలతోనే.. ఇలా స్పెషల్ ఫోటో తీయించారనే డౌట్ రాక మానదు. విప్పేసి విసిరేయించే కాన్సెప్ట్ బాగానే ఉన్నా.. వాణీకపూర్ కి ముద్దులు పెట్టడం బిజిగా ఉండి కాబోలు.. అసలు సంగతి మర్చిపోయాడు రణవీర్ సింగ్.