Begin typing your search above and press return to search.

వీడియో : హీరో కారుకు యాక్సిడెంట్‌

By:  Tupaki Desk   |   16 Oct 2020 10:45 AM IST
వీడియో : హీరో కారుకు యాక్సిడెంట్‌
X
బాలీవుడ్‌ యంగ్‌ హీరో రణ్‌ వీర్‌ సింగ్‌ ప్రయాణిస్తున్న కారును ఒక బైక్‌ వ్యక్తి స్పీడ్‌ గా వచ్చి ఢీ కొట్టాడు. వెనుక నుండి బైక్‌ ఢీ కొట్టడంతో వెంటనే హీరో రణ్‌ వీర్‌ సింగ్‌ కిందకు దిగి కారుకు ఏమైనా అయ్యిందా అని చూశాడు. జనాలు చాలా మంది ఉన్నా కూడా ఆయన కారు దిగడంతో ఒక్కసారిగా అక్కడ జనాలు గుమ్మి గూడారు. పలువురు తమ మొబైల్స్‌ లో రణ్‌ వీర్‌ సింగ్‌ ను చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. కాస్త గాబరాగా కారు దిగిన రణ్‌ వీర్‌ సింగ్‌ తన బెంజ్‌ కారు వెనుక ఏమైనా డ్యామేజీ జరిగిందా చూసుకుని ఏం లేదనుకుని సింపుల్‌ గా మళ్లీ కారు ఎక్కి అక్కడ నుండి వెళ్లి పోయాడు.

కారుకు ఎలాంటి డ్యామేజీ లేకపోవడం వల్ల వెనుక నుండి కారును ఢీ కొట్టిన బైక్‌ వాలాపై ఎలాంటి చర్యలు తీసుకోవడం కాని అతడితో వాదనుకు దిగడం కాని జరగలేదు. రణ్‌ వీర్‌ సింగ్‌ నటించిన 83 చిత్రం విడుదలకు రెడీ అవుతుంది. ఇదే సమయంలో ఆయన తెలుగులో సూపర్‌ హిట్‌ అయిన ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమా రీమేక్‌ లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. రణ్‌ వీర్‌ సింగ్‌ యాక్సిడెంట్‌ విషయం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు మరియు ఫొటోలు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికి ఏం కాలేదు అలాగే రణ్‌ వీర్‌ సింగ్‌ కారు కూడా డ్యామేజీ అవ్వలేదు.