Begin typing your search above and press return to search.

ఆలియాను ఇలా ఎప్పుడైనా చూశారా?

By:  Tupaki Desk   |   22 March 2016 5:00 PM IST
ఆలియాను ఇలా ఎప్పుడైనా చూశారా?
X
లేత జున్ను ముక్కలా సున్నితంగా ఉంటుంది ఆలియా భట్. యుద్ధ వీరుడిలా మ్యాన్లీగా ఉంటాడు రణ్ వీర్ సింగ్. ఐతే అంత సున్నితమైన ఆలియా. ఖాఖీ డ్రెస్సు.. మెడలో రుమాలు వేసుకుని.. కళ్లకు లోకల్ మేడ్ జోడు పెట్టుకుని.. చేతిలో టీ గ్లాస్ పట్టుకుని యమ చిరాగ్గా నిలబడింది. ఇక రణ్ వీర్ ఏమో.. నెత్తికి నూనె పెట్టుకుని ముసలోళ్లు పెట్టుకునే ఓ కళ్లజోడు పెట్టుకుని.. జుబ్బా వేసుకుని.. భుజానికో బ్యాగు తలిగించుకుని పల్లెటూరి బైతులా తయారయ్యాడు. ఆలియా - రణ్ వీర్ ఇలా పూర్తిగా అవతారాలు మార్చేసి సరికొత్తగా తయారైన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

ఆలియా - రణ్ వీర్ ఇలా తయారవడానికి కారణం సినిమా కాదు. ఓ అడ్వర్ టైజ్ మెంట్. కొత్తగా లాంచ్ అయిన ఓ ట్రావెల్ పోర్టల్ యాడ్ కోసం వీళ్లిద్దరినీ ఈ అవతారాల్లోకి మార్చేశారు. బాలీవుడ్ లో మాంచి క్రేజున్న రణ్ వీర్ - ఆలియాలతో ఈ యాడ్ తీస్తే జనాలకు ఈజీగా చేరువవుతుందన్న ఆలోచనతో ఈ సంస్థ.. వాళ్లిద్దరినీ సంప్రదించింది. ఇద్దరూ ఓకే అనడంతో చకచకా ఏర్పాట్లు చేసేశారు. యాడ్ తయారైపోయింది. త్వరలోనే ఈ ప్రకటన జనాల ముందుకు రాబోతోంది. రణ్ వీర్ సంగతలా వదిలేద్దాం కానీ.. ఈ ఊర మాస్ క్యాబ్ డ్రైవర్ అవతారంలో ఆలియా మాత్రం అదరగొట్టేసిందంతే. ఆమె ఇలా ఇంతకుముందు ఎవ్వరూ చూసి ఉండరు.