Begin typing your search above and press return to search.
కపిల్ 83 విడుదల తేదీ కన్ఫర్మ్
By: Tupaki Desk | 20 Feb 2021 12:00 PM ISTఇండియన్ క్రికెట్ చరిత్రలో ఎప్పటికి మర్చిపోలేని సిరీస్ వరల్డ్ కప్ 1983 నేపథ్యంలో బాలీవుడ్ లో సినిమా రూపొందిన విషయం తెల్సిందే. 1983 వరల్డ్ కప్ టీం ఇండియా జట్టుకు సారధ్యం వహించిన కపిల్ దేవ్ బయోపిక్ గా రూపొందిన '83' సినిమా గత ఏడాది విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా వల్ల ఆలస్యం అయ్యింది. ఆ మద్య వంద కోట్లకు గాను ఓటీటీ ఆఫర్ వచ్చిందని వార్తలు వచ్చాయి. అయినా కూడా చిత్ర యూనిట్ సభ్యులు ఇవ్వలేదు. థియేటర్ రిలీజ్ కోసం వెయిట్ చేసిన మేకర్స్ ఎట్టకేలకు విడుదల తేదీని కన్ఫర్మ్ చేశారు.
దేశంలో థియేటర్లను నూరు శాతం ఆక్యుపెన్సీతో నడుపుకునేందుకు కేంద్రం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ సినిమాను జూన్ 4 న విడుదల చేయాలని నిర్ణయించినట్లుగా అధికారికంగా ప్రకటించారు. దేశ వ్యాప్తంగా పలు భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా పేర్కొన్నారు.
ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రను రణ్వీర్ సింగ్ పోషించగా హీరోయిన్ గా దీపిక పదుకునే నటించిన విషయం తెల్సిందే. ఈ సినిమా విడుదల కోసం ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టిన తర్వాత కరోనా వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. ఈ సినిమా కోసం ఇండియన్ క్రికెట్ అభిమానులు మరియు సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.