Begin typing your search above and press return to search.

మ‌హ‌మ్మారీ OTT ల దెబ్బ‌కు బాలీవుడ్ గోల్ మాల్

By:  Tupaki Desk   |   13 Oct 2020 8:00 AM IST
మ‌హ‌మ్మారీ OTT ల దెబ్బ‌కు బాలీవుడ్ గోల్ మాల్
X
అక్టోబర్ 15 నుండి థియేటర్లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. థియేట‌ర్ల‌లో సినిమాలను విడుదల చేయడంపై చిత్రనిర్మాతలు ఇంకా సందేహిస్తున్నారు. అక్షయ్ కుమార్ నటించిన సూర్యవంశీ ఇంతకుముందు మార్చిలో విడుదల కావాల్సి ఉండ‌గా తరువాత నవంబర్ కు వాయిదా వేశారు. ఆ త‌ర్వాత‌ వచ్చే ఏడాది ఆరంభానికి వాయిదా ప‌డింది. అయితే రణవీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌ధారిగా కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న 83 క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుందని స‌మాచారం.

సూర్యవంశీ దీపావళి స‌మ‌యంలో థియేటర్లలోకి వస్తుందని ఊహించినా ఇప్పుడు 2021 కి వాయిదా పడింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే,.. అక్షయ్ కుమార్ న‌టించ‌నున్న‌ మరో చిత్రం `లక్ష్మీ బాంబ్` దీపావళికి కొద్ది రోజుల ముందు నవంబర్ 9 న డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో విడుదల కానుంది. నిజానికి కిలాడీ వ‌ర్సెస్ కిలాడీ ఎపిసోడ్ ఊహించ‌నిది. దీపావ‌ళి స‌మ‌యంలోనే కిలాడీ అక్ష‌య్ న‌టించిన రెండు సినిమాలు రిలీజ్ చేయాల్సిన ప‌రిస్థితి ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

83 మరియు సూర్యవంశీ సహ నిర్మాత రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ సిఇఒ షిబాసిష్ సర్కార్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ,.. “సూర్యవంశీ కోసం 83 తేదీని మార్చడానికి మేము ఖచ్చితంగా ఇష్టపడం. స్పోర్ట్ డ్రామా ఇప్పటికీ క్రిస్మస్ సందర్భంగా విడుదలకు సిద్ధం చేశాం. దర్శక హీరోల‌తో మాట్లాడి సూర్యవంశీ కొత్త తేదీని మేము నిర్ణయించుకోవాలి. కాని ఈ చిత్రం జనవరి మార్చి మధ్య విడుదల కావాలి`` అని తెలిపారు. జూన్ లో థియేటర్ య‌జ‌మానులు దీపావళి నాటికి `సూర్యవంశీ` చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ధృవీకరించగా `83` చిత్రాన్ని క్రిస్మస్ సందర్భంగా తెరపైకి వ‌స్తుంద‌ని ఊహాగానాలు సాగించారు. అక్షయ్ కుమార్ లక్ష్మీ బాంబ్ .. దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ దిల్ బెచారాతో సహా ఏడు పెద్ద చిత్రాల డిజిటల్ విడుదలను OTT ప్లాట్‌ఫాం డిస్నీ + హాట్‌స్టార్ ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన వచ్చింది.

సూర్యవంశి ఇంతకుముందు మార్చి 27 న విడుదల కావాల్సి ఉండ‌గా.. కరోనావైరస్ మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ఈ చిత్ర నిర్మాతలు దీపావళికి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన సూర్యవంశీ కాప్ డ్రామాతో తెర‌కెక్కిన‌ది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ డిసిపి వీర్ సూర్యవంశి పాత్రలో నటించారు.

83 విష‌యానికి వ‌స్తే ఈ చిత్రం భారత క్రికెట్ జట్టు 1983 ప్రపంచ కప్ గెలుపు ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రంలో కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ నటించగా... క్రికెటర్ భార్య రోమి దేవ్ పాత్రలో దీపికా పదుకొనే కనిపించనున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 10 న తెరపైకి రావాల్సి ఉన్నా.. ఇప్పుడు క్రిస్మ‌స్ ని ఖాయం చేశారు.