Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్.. స్టార్ హీరో.. నో బ్రేకప్

By:  Tupaki Desk   |   4 Nov 2017 8:25 AM GMT
స్టార్ హీరోయిన్.. స్టార్ హీరో.. నో బ్రేకప్
X
బ్రేకప్ అనే పదం బాలీవుడ్ కి బాగా దగ్గరైన ఒక సంబంధం. ఒక స్టార్ జంట కలుసుకుంటే చాలు రూమర్ అనే కోయిల లవ్ అని చెబితే.. కాకి అనే గాసిప్ సీక్రెట్ గా బ్రేకప్ అనిస్తోంది. ఇక తారలు ఈ కాకి కూతలు కోయిల కామెంట్లు రోజు వినే పాటల్లానే విని వదిలేస్తున్నారు. కానీ ఒక్కోసారి కొందరు సీరియస్ అయిన సందర్బాలు కూడా ఉన్నాయనుకోండి.

కానీ ఈ మధ్యన అలాంటివి సినీ ప్రకృతిలో భాగమేనని అలవాటు చేసుకుంటున్నారు. ఇక డీప్ గా లవ్ లో ఉన్నారో లేదో తెలియదు గాని బాలీవుడ్ స్టార్ హీరో రన్ వీర్ సింగ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే లవ్ బ్రేకప్ అయ్యిందని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరి మధ్య దూరం కూడా బాగా పెరిగిందని పద్మావతి షూటింగ్ లో కూడా మాట్లాడుకోవడం లేదని రూమర్స్ చాలా వచ్చాయి.

అయితే దీపిక ఆ రూమర్స్ కి తనదైన శైలిలో కౌంటర్ వేసింది. తను ఉన్న మ్యాగజైన్ కవర్ ఒకటి రణ్వీర్ షేర్ చేశాడు. దానిపై దీపిక 'ufff' అనే కామెంట్ పెట్టింది. దానికి అతను ముద్దును తలపించే ఎమోజీ ఒకటి రిప్లయ్ ఇచ్చాడు. కట్ చేస్తే.. దానికి 'రైట్ బ్యాక్ ఎట్ యు' అంటూ రిప్లయ్ ఇచ్చింది దీపిక. ఇదంతా చూస్తుంటే.. ఇద్దరూ ఎంత పీకల్లోతు ప్రేమలో ఉన్నారు అర్ధమవుతోందిగా!!