Begin typing your search above and press return to search.

రంజిత‌మే..25 డేస్ త‌రువాత‌ తెలుగు వెర్ష‌న్‌!

By:  Tupaki Desk   |   30 Nov 2022 7:30 AM GMT
రంజిత‌మే..25 డేస్ త‌రువాత‌ తెలుగు వెర్ష‌న్‌!
X
ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ 'వారీసు'. వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు త‌న సోద‌రుడు శిరీష్ తో క‌లిసి ఈ మూవీని అత్యంత భారీ బ‌డ్జెట్ తో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. దిల్ రాజు తొలి సారి త‌మిళంలో స్టార్ హీరో విజ‌య్ తో నిర్మిస్తున్న సినిమా కావ‌డంతో ప్ర‌తీ విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ రిచ్ గా ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. తెలుగులో ఇదే మూవీని 'వార‌సుడు' పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఫ‌స్ట్ లుక్ నుంచి ముందు త‌మిళ వెర్ష‌న్‌.. ఆ త‌రువాతే తెలుగు వెర్ష‌న్ ని విడుద‌ల చేస్తూ వ‌స్తున్నారు.

సంక్రాంతి బ‌రిలో తమిళ‌, తెలుగు భాష‌ల్లో ఒకే సారి భారీ స్థాయిలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ మూవీకి సంబంధించిన ప్ర‌మోష‌న్స్ ని లిరిక‌ల్ వీడియోల‌తో చిత్ర బృందం మొద‌లు పెట్టింది. త‌మ‌న్ సంగీతం అందించ‌గా వివేక్ సాహిత్యం అందించిన 'రంజిత‌మే.. 'అంటూ సాగే ఫ‌స్ట్ సింగిల్ లిరిక‌ల్ వీడియోని మేక‌ర్స్ విడుద‌ల చేశారు. హీరో విజ‌య్ తో పాటు ఎం.ఎం. మాన‌సి ఆల‌పించిన ఈ పాట త‌మిళ వెర్ష‌న్ విడుద‌లై 25 రోజుల‌వుతోంది.

విజ‌య్ మార్కు మాస్ స్టెప్పుల‌తో జానీ మాస్ట‌ర్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ నెట్టింట ట్రెండ్ అవుతూ తెగ వైర‌ల్ గా మారింది. ఇప్ప‌టికే యూట్యూబ్ లో ఈ సాంగ్ 75 (7 కోట్ల‌కు పైగా) మిలియ‌న్ ల వ్యూస్ ని క్రాస్ చేసి రికార్డు సృష్టించింది.

గ‌త కొన్ని రోజులుగా త‌మిళ సినీ ప్రియుల‌తో స్టెప్పులేయిస్తూ యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతూ వ‌స్తోంది. క‌వ‌ర‌న్ సాంగ్స్‌, ఇన్ స్టా రీల్స్ తో విజ‌య్ అభిమానులు ఈ పాట‌ని నెట్టింట వైర‌ల్ గా ట్రెండ్ చేస్తున్నారు.

ఇప్ప‌డు ఇదే పాట‌కు తెలుగు వెర్ష‌న్ ను చిత్ర బృందం బుధ‌వారం విడుద‌ల చేసింది. తెలుగు పాట‌కు రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యం అందించ‌గా అనురాగ్ కుల‌క‌ర్ణి, ఎం.ఎం. మాన‌సి ఆల‌పించారు. త‌మ‌న్ అందించిన సంగీతం ఈ పాట‌కు ప్ర‌ధాన హైలైట్ గా నిలుస్తోంది. దీంతో 'రంజిత‌మే ..' లిరిక‌ల్ వీడియో నెట్టింట యూత్ ని రికార్డ్ స్థాయిలో ఎట్రాక్ట్ చేస్తూ ట్రెండింగ్ లో టాప్ లో వుంటోంది. హీరో విజ‌య్ మాస్ స్టెప్పులు, ర‌ష్మిక గ్లామ‌ర్ ఈ పాట‌కు ప్రధాన హైలైట్ గా నిలిచాయి.

హీరో విజ‌య్ 'బీస్ట్‌' వంటి యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ త‌రువాత చేస్తున్న ఫ్యామిలీ యాక్ష‌న్ డ్రామా కావాడం.. ఇందులోని కీల‌క పాత్ర‌ల్లో త‌మిళ‌, తెలుగు ఇండ‌స్ట్రీల‌కు చెందిన క్రేజీ తారాగ‌ణం న‌టించ‌డంతో ఈ మూవీపై త‌మిళ‌, తెలుగు భాష‌ల్లోనూ భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. థియేట‌ర్ వివాదాల మ‌ధ్య ఈ మూవీని సంక్రాంతికి తమిళ‌, తెలుగు భాష‌ల్లో అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయాల‌ని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే కీల‌క ఏరియాల్లో థియేట‌ర్ల‌ని లాక్ చేయ‌డంతో తెలుగులోనూ ఈ మూవీ భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న‌ట్టుగా తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.