Begin typing your search above and press return to search.

రంజిత‌మే.. ద‌ళ‌ప‌తి..నేష‌న‌ల్ క్ర‌ష్ చించేశారుగా!

By:  Tupaki Desk   |   5 Nov 2022 2:02 PM GMT
రంజిత‌మే.. ద‌ళ‌ప‌తి..నేష‌న‌ల్ క్ర‌ష్ చించేశారుగా!
X
త‌మిళ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టిస్తున్న త‌మిళ‌ మూవీ `వారీసు`. తెలుగు ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు, శిరీష్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇందులో విజ‌య్ కి జోడీగా నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తోంది. త‌మిళంలో `వారీసు`గా రూపొందుతున్న ఈ మూవీని తెలుగులో `వార‌సుడు`గా విడుద‌ల చేయ‌బోతున్నారు. సంక్రాంతికి ఈ మూవీ తమిళంతో పాటు తెలుగు,హిందీలోనూ అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

ఫ‌స్ట్ లుక్ టైటిల్ అనౌన్స్ మెంట్ నుంచి త‌మిళ వెర్ష‌న్ కే తొలి ప్ర‌ధాన్య‌తనిస్తూ వ‌స్తున్న దిల్ రాజు అండ్ కో ఫ‌స్ట్ సింగిల్ `రంజిత‌మే...` విష‌యంలోనూ అదే పంథాని అనుస‌రించింది. సంక్రాంతి రిలీజ్ కి సినిమాని తమిళ‌, తెలుగు, హిందీ భాష‌ల్లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్న మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ ని మొద‌లు పెట్టేశారు. ఇందులో భాగంగా ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియోగా `రంజిత‌మే..` అంటూ సాగే వీడియో సాంగ్ త‌మిళ వెర్ష‌న్ ని శ‌నివారం రిలీజ్ చేశారు.

త‌మ‌న్ సంగీతం అందించిన ఈ పాట‌కు వివేక్ సాహిత్యం అందించారు. సింగ‌ర్ ఎం.ఎం. మాన‌సితో క‌లిసి హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ ఈ పాట‌ని ఆల‌పించాడు. మాస్ బీట్ తో సాగే ఈ పాట‌కు జాని డ్యాన్స్ కంపోజ్ చేశారు. మాస్ బీట్ ల‌తో సాగిన ఈ పాట‌కు ద‌ళ‌ప‌తి విజ‌య్‌, ర‌ష్మిక మంద‌న్న త‌న‌దైన స్టెప్పుల‌తో ఇర‌గ‌దీసేశారు. ఓ రేంజ్ లో చించేశారు. కార్తీక్ ప‌ళ‌ని సినిమాటోగ్ర‌ఫీ, ఆర్ట్ డైరెక్ట‌ర్ ప్ర‌తిభ‌, త‌మ‌న్ బీట్, యుగంధ‌ర్ వీఎఫ్ ఎక్స్ వెర‌సి `రంజితమే.. సాంగ్ .. క‌ల‌ర్ ఫుల్ గా సాగ‌నుంద‌ని తెలుస్తోంది.

మునుపెన్న‌డూ లేని విధంగా తొలి సారి హీరో విజ‌య్ తెలుగు ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌తో క‌లిసి ఈ మూవీ చేస్తుండ‌టం.. క్రేజీ న‌టీన‌టులంతా సినిమాలో వుండ‌టం.. భారీ స్టార్ కాస్టింగ్ తో నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్ ఈ మూవీని అత్యంత క‌ల‌ర్ ఫుల్ గా నిర్మిస్తుండ‌టంతో సినిమాపై అటు త‌మిళంలోనూ.. ఇటు తెలుగులోనూ భారీబ‌జ్ క్రియేట్ అయింది. ఈ పాట‌లో విజ‌య్,ర‌ష్మిక‌ల జోడీ చాలా కూల్ గా మంచి కెమిస్ట్రీతో క‌నిపిస్తున్న తీరు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటోంది.

ఫ‌స్ట్ సింగిల్ లో ఈ ఇద్ద‌రు జోడీ చాలా అందంగా, చూడ‌ముచ్చ‌ట‌గా క‌నిపిస్తూ క‌నువిందు చేస్తోంది. ఈ పాట‌లో వీరిని చూసిన అభిమానులు గాల్లో తేలిపోవ‌డం ఖాయం అని చెబుతున్నారు. విజ‌య్ న‌టించిన సినిమాల‌కు ఈ మ‌ధ్య జానీ మాస్ట‌ర్ డ్యాన్స్ కంపోజ్ చేస్తున్నారు. అయితే ఈ పాట‌కు జానీ మాస్ట‌ర్ కంపోజ్ చేసిన డ్యాన్స్ విజ‌య్ అభిమానుల‌ని చేత స్టెప్పులు వేయించేలా వుంది. `బీస్ట్` కోసం అర‌బిక్ కూతు` సాంగ్ కి జానీ మాస్ట‌ర్ కొరియోగ్రఫీ అందించాడు. ఈ పాట‌లాగే `రంజితమే..` సాంగ్ కూడా వైర‌ల్ అయ్యేలా వుంది. తెలుగు వెర్ష‌న్ సాంగ్ ని త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌బోతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.