Begin typing your search above and press return to search.

హీరోయిన్‌ ప్రెగ్నెంట్‌, జనవరిలో ప్రసవం

By:  Tupaki Desk   |   2 Sept 2015 10:48 AM IST
హీరోయిన్‌ ప్రెగ్నెంట్‌, జనవరిలో ప్రసవం
X
అభిషేక్‌ బచ్చన్‌ - ఐశ్వర్యారాయ్‌ బాలీవుడ్‌ లో ఆదర్శజంట. ఈ జోడీకి పుట్టిన బేబి ఆరాధ్యా వయసు ఇప్పటికి ఐదేళ్లు. బాలీవుడ్‌ హీరో రితేష్‌ దేశ్‌ముఖ్‌ ని పెళ్లాడి జెనీలియా ఏడాది కిందటే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. వీళ్లంతా హ్యాపీ లైఫ్‌ ని లీడ్‌ చేస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్‌ కే చెందిన ఓ సీనియర్‌ హీరోయిన్‌ కూడా ఇదే బాటలో తల్లి కాబోతోంది. సీక్రెట్‌ ప్రసవానికి రెడీ అవుతోంది. అది కూడా దేశం కాని దేశంలో, దేశం విడిచి విదేశాల్లో ప్రసవానికి సిద్ధమవుతోంది. ఇంకాస్త డీటెయిల్స్‌ లోకి వెళితే...

బాలీవుడ్‌ వెటరన్‌ హీరోయిన్‌ రాణీ ముఖర్జీ ప్రేమాయణం, పెళ్లి వగైరా విషయాలన్నీ తెలిసిందే. అప్పటికే పెళ్లయి భార్య, పిల్లలు ఉన్న ఫిలింమేకర్‌ ఆదిత్యచోప్రాతో చాలా కాలం సహజీవనం సాగించిన రాణీ గత ఏడాది హడావుడిగా అతడిని పెళ్లి చేసేసుకుంది. ప్రస్తుతం ఈ జోడీ ఓ బిడ్డకు జన్మనీయబోతున్నారు. అయితే ఇదంతా సీక్రెట్‌ గానే. ఇండియాలో అనవసర రాద్ధాంతం ఎందుకు అనుకున్నారో ఏమో! ఈ ఏడాది జూలైలోనే లండన్‌ వెళ్లిపోయారు. అక్కడే ప్రసవానికి ఏర్పాట్లు చేసుకున్నారు. రాణీజీ జనవరిలో బిడ్డను ప్రసవిస్తారని రివీలైంది. రాణీ ముఖర్జీ మరదలు జ్యోతి ముఖర్జీ టంగ్‌ స్లిప్పవ్వడంతో ఈ నిజం తెలిసింది. రాణీజీకి ఓ వీరాభిమాని అయిన ఓ డాక్టరు ప్రసవానికి ముందు అవసరమైన ప్రీ నాటల్‌ మసాజ్‌ థెరపీ చేస్తున్నారట.