Begin typing your search above and press return to search.

ఈ భూతాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు

By:  Tupaki Desk   |   30 July 2016 4:31 PM GMT
ఈ భూతాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు
X
హీరోయిన్ అయేందుకు తెగ ప్రయత్నించి.. తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించింది హాట్ యాంకర్ రేష్మీ గౌతమ్. హీరోయిన్ అందాలనను వాడి వేడిగా చూపించి.. గుంటూరు టాకీస్ తో హిట్ కొట్టాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. రేష్మీ పేరు మార్మోగిపోవడంతో.. బోలెడన్ని ఆఫర్లు వచ్చిపడ్డాయి.

రీసెంట్ గా అంతం అంటూ ఓ సినిమాతో ఆకట్టుకోలేకపోయిన రేష్మి.. ఇప్పుడు రాణి గారి బంగళా అంటూ జనాల ముందుకొచ్చింది. ఇందులో ఈమె భూతంగా కూడా నటించేసింది. కానీ ఇది పేరుకే హారర్ కామెడీ. భయపడ్డం అనే మాటకు ఎక్కడా స్కోప్ లేకపోగా.. కామెడీ కూడా పండలేదు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ అనే మాటకు అర్ధాన్ని తుడిచేసిందని చాలామంది తిట్టుకుంటున్నారు కూడా. రేష్మీ భూతంగా వచ్చి భయపెడతానన్నా.. అదే గెటప్ లో అందాలు చూపిస్తానన్నా ఆడియన్స్ మాత్రం కనెక్ట్ కాలేదు.

అసలు సినిమా వచ్చిన సంగతే చాలామంది పట్టించుకోకపోగా.. చూసినోళ్లు బావురుమంటున్నారని టాక్. రాణి గారి బంగళా కూడా నిరుత్సాహపరచడంతో.. ఇప్పుడు రేష్మీ జాగ్రత్త పడాల్సిన అవసరం వచ్చిందని చెప్పాలి. ప్రతీ ఆఫర్ ని ఒప్పేసుకోవడం కాకుండా.. సినిమా ఎంపిక విషయంలో ఎంత ఎలర్ట్ గా ఉండాలో రేష్మీ గౌతమ్ కి అంతం.. రాణి గారి బంగళా చెప్పాయి. ఇంకోటి ఈ బాపతు సినిమా వస్తే.. అప్పుడీ హాటీ పరిస్థితేంటో?