Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: హాలీవుడ్ రేంజులో రంగూన్

By:  Tupaki Desk   |   6 Jan 2017 6:03 AM GMT
ట్రైలర్ టాక్: హాలీవుడ్ రేంజులో రంగూన్
X
ఎప్పుడూ మనం హాలీవుడ్ లో రూపొందిన ఎపిక్ సినిమాలను చూసి వావ్ అనుకుంటూ ఉంటాం. ముక్యంగా 2వ ప్రపంచ యుద్దం నేపథ్యంలో రూపొందిన చాలా సినిమాలను హాలీవుడ్ వారు చాలా గొప్పగా రూపొందించారు. కాని మన ఇండియన్ స్ర్కీన్ పై అలాంటి ఫీట్లను చాలా అరుదుగా చేస్తుంటాం. ఒకటి బడ్జెట్ కారణంగా రెండవది అలాంటి కథలను అసలు మన తయారు చేయకపోవడం. కాని దర్శకుడు విశాల్ భరద్వాజ్ మాత్రం ఇప్పుడు అన్నింటికీ సమాధానం చెప్పేస్తున్నాడు.

''రంగూన్'' అంటూ 2వ ప్రపంచం యుద్ద సమయంలో జరిగే ఒక ప్రేమకథను తీస్తున్నారు విశాల్. సరిగ్గా 1944లో భారతదేశం స్వాతంత్ర్యం కావాలంటూ పోరాటలు చేస్తున్న నేపథ్యంలో జపనీస్ సేనలు మనం బ్రిటీష్ వారికి సపోర్టు చేస్తున్నాం కాబట్టి.. బర్మా ద్వారా మనపై ఎటాక్స్ చేశారు. ఆ సమయంలో ఇండియా రంగూన్ దగ్గర ఒక క్యాంప్ ఏర్పాటు చేసి యుద్ద చేయసాగింది. ఆ క్యాంపులో మేజర్ సైఫ్ ఆలీ ఖాన్ అయితే.. అదే సమయంలో బొంబాయిలో ఉన్న క్యాబరే డ్యాన్సర్ కమ్ సినిమా హీరోయిన్ జూలియాగా కంగనా రనౌత్ నటించింది. ఆమెను సైఫ్‌ రంగూన్ తీసుకెళ్ళడానికి.. ఒక ట్రైన్లో సామాన్య సిపాయి అయిన జావెద్.. అదేనండీ షాహీద్ కపూర్ ను.. ఆమెకు సెక్యూరిటీగా ఎపాయింట్ చేస్తాడు. ఆ షాహీద్ ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతడి ప్రేమలో పడుతుంది. సినిమా సెటప్ చూడ్డానికి 'ది ఇంగ్లీష్‌ పేషెంట్' సినిమాకు దగ్గరగా ఉన్నా కూడా.. సినిమాలోని కంటెంట్ మాత్రం ఇంట్రెస్టింగ్ గానే ఉంది. కమీన్.. హైదర్.. వంటి సినిమాలను తీసిన విశాల్ భరద్వాజ్ మరోసారి ఒక ఇంటెన్స్ లవ్ డ్రామా తీస్తున్నాడని ఇట్టే చెప్పేయొచ్చు.

అయితే ఈ ట్రైలర్ చూసి సెటైర్లు వేసేవారు లేకపోలేదు. వార్ డ్రామా అనుకున్నప్పుడు మధ్యలో ఈ లవ్ స్టోరీ అంటూ కామెంట్లు చేసేవారు ఉన్నారు. కాకపోతే హాలీవుడ్ లో హిట్టయిన ఎటువంటి రియల్ స్టోరీ అయిన.. టైటానిక్ నుండి పెర్ల్ హార్బర్ వరకు.. అన్నింటిలోనూ ప్రేమ కథను కలిపినప్పుడే అసలు మజా పండేది. అందుకే ''రంగూన్'' హాలీవుడ్ కు ధీటుగా ఉందని చెప్పేది. హ్యావ్ ఏ లుక్!!



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/