Begin typing your search above and press return to search.

మూడు రోజుల్లో.. రంగస్థలం రికార్డే

By:  Tupaki Desk   |   2 April 2018 6:16 AM GMT
మూడు రోజుల్లో.. రంగస్థలం రికార్డే
X
దృవ సినిమాతో ఒక్కసారిగా తనకు తాను కొత్తగా అనిపించుకొని ప్రేక్షకుల మనసును గెలుచుకున్న రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాతో మరింత కొత్తగా అనిపించాడు. దీంతో తన మార్కెట్ పరిధిని కూడా చాలా పెంచుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమా మొదటి వారం ఊహించని స్థాయిలో కలెక్షన్స్ ను అందుకుంది. అనుకున్నట్టుగానే నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది.

బాహుబలి 1 మొదటి వరం 41 కోట్ల షేర్స్ ను అందించింది. ఇక బాహుబలి 2 అయితే 75 కోట్ల షేర్స్ ని అందుకొని మొదటి స్థానంలో ఫిక్స్ అయిపొయింది. ఇక మొదటి వారం అత్యధిక వసూళ్లు అందుకున్న మూడవ చిత్రంగా మెగా పవర్ స్టార్ రంగస్థలం నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 37.4 కోట్ల షేర్స్ ని అందుకుంది. టోటల్ గ్రాస్ విషయానికి వస్తే 57 కోట్లను కొల్లగొట్టి రామ్ చరణ్ కెరీర్ కు బూస్ట్ ఇచ్చింది.

నైజం - 10,05,00,000

సిడెడ్ - 7,50,00,000

నెల్లూరు - 1,40,52,664

గుంటూరు - 4,25,00,000

కృష్ణ - 2,80,00,000

వెస్ట్ - 2,71,65,000

ఈస్ట్ - 3,50,00,000

ఉత్తరాంధ్ర - 5,18,13,640

మొత్తం 3 రోజులు AP & TS వాటా 37.40Cr

కర్నాటక - 4,80,00,000

రెస్ట్ ఆఫ్ ఇండియా - 1,30,00,000

USA - 9,30,00,000

రెస్ట్ ఆఫ్ వరల్డ్ - 2,70,00,000

మొత్తం 3 రోజుల వరల్డ్ వైడ్ వాటా 55.50Cr